గ్రహణానికి 9 గంటల ముందే సూతక కాలం మొదలైపోతుంది ఆ సమయంలో వంట చేయడం, ఆహారం తినడం వంటివి చేయకూడదనే ఆచారం ఉంది. చాలా మంది గ్రహణానికి ముందు తమ ఆహారంలో తులసి ఆకులు, దర్భ గడ్డిని వేస్తారు. ఇది ఆహారం విషపూరితం కాకుండా నివారిస్తుందని నమ్మకం. గ్రహణ సమయంలో వండిన ఆహారాన్ని తినడం మానేయాలని చెబుతారు. అందుకే ఆహారంలో దర్భ గడ్డి లేదా తులసి ఆకులను వేసి ఉంచుతారు.
గ్రహణం ముగిసిన తర్వాత తలకు స్నానం చేసి, గుడికి వెళ్లడం మంచిది. గుడికి వెళ్లలేని వారు ఇంట్లోనే దీపం వెలిగించి దేవుడిని పూజించాలి. తగినంత నీరు తాగాలి. ప్రశాంతంగా కూర్చుని దైవారాధన చేసుకోవాలి.