చంద్రగ్రహణం రాబోతోంది. సెప్టెంబర్ 7, 2025న చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఆరోజు కష్టాల నుండి బయట పెట్టడానికి గ్రహణ సమయంలో చదవాల్సిన శక్తివంతమైన మంత్రాలు కొన్ని ఉన్నాయి. అవి గ్రహణం సమయంలో కచ్చితంగా చదవాలి.
జ్యోతిష్య శాస్త్రమైనా, మత విశ్వాసాలైనా, పురాణాలైనా చంద్రగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెబుతాయి. అందుకే చంద్రగ్రహణం రోజు ఎన్నో నమ్మకాలు, విశ్వాసాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అమల్లో ఉన్నాయి. చంద్రగ్రహణం రోజు ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు? అనేది కూడా ఎంతోమంది వివరిస్తూ ఉంటారు. మన దేశంలో ఈసారి చంద్రగ్రహణం పూర్తిగా కనిపించబోతోంది. కాబట్టి చంద్రగ్రహణం ప్రభావం మన దేశంపై అధికంగానే ఉంటుంది.
24
కష్టాలు తీరేలా
చంద్రగ్రహణం మొదలైన సమయంలో మీరు కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి గట్టెక్కాలంటే ప్రతికూల శక్తులను తొలగిపోయేలా చేసే శక్తివంతమైన మంత్రాలను చదవాలి. ఇది మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. ఇబ్బందుల్ని బయటపడేలా చేస్తుంది. ఏ మంత్రాలను చదవాలో కింద ఇచ్చాము. వీటిలో దేన్ని చదివినా కూడా మీకు అంతా మేలే జరుగుతుంది.
34
ఈ మంత్రాలు
చంద్రగ్రహణ సమయంలో మృత్యుంజయ మంత్రాన్ని చదివితే ఎంతో మంచిది. లేదా చంద్రబీజ మంత్రాన్ని కూడా చదవవచ్చు. గాయత్రి మంత్రం, విష్ణు మంత్రం, దుర్గా మంత్రం కూడా మీరు చదివితే మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఆ మంత్రాలను ఇక్కడ మేము ఇచ్చాము. వీటిని ఆరోజు చదివేందుకు ప్రయత్నించండి.