Lucky Zodiac signs: ఈ 4 రాశుల్లో పుట్టిన వారు ఏ విషయంలోనైనా విజయం సాధిస్తారు, ఓటమంటే తెలియదు

Published : Nov 09, 2025, 04:58 PM IST

Lucky Zodiac signs: కొన్ని రాశుల వారు ఎంతో లక్కీ. వారు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో కచ్చితంగా విజయం సాధిస్తారు. ఆ నాలుగు రాశులు గురించి ఇక్కడ ఇచ్చాము. మీ రాశి అందులో ఉందో చెక్ చేసుకోండి. 

PREV
16
ఎందులోనైనా విజయం వీరిదే

విజయం సాధించాలని ప్రతిఒక్కరికీ ఉంటుంది. కొందరికి మరింత పట్టుదల ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఆ పట్టుదల ఎక్కువ. వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధిస్తారు. వీరికి విజయం పట్టుదల, కఠోర శ్రమ, సరైన ప్రణాళిక వంటివి ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశుల వారికి సహజంగానే విజయం దక్కుతుంది. అలాంటి రాశుల వారు ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారు.

26
సింహ రాశి

సింహరాశి వారు ఎంతో లక్కీ. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అందుకే వీరికి సహజంగానే నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరు పుట్టుకతోనే నాయకులుగా ుంటారు. వీరిలో  ధైర్యం, ఆత్మవిశ్వాసం అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరికి దృఢ సంకల్పం, నాయకత్వ పటిమ వంటివి ఎక్కువ కాబట్టి  ఏ రంగంలోనైనా వీరు సులభంగా విజయాన్ని అందుకుంటారు. వీరికి ఓటమి నచ్చదు. ఓడిపోరు కూడా.

36
వృషభ రాశి

వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి  స్థిరత్వం, ఓర్పు అధికంగా ఉంటాయి.  ఏ విషయంలోనైనా వీరికి పట్టుదల అధికం.  వీరు ఆలస్యంగానైనా విజయాన్ని సాధిస్తారు. వీరి ప్రణాళిక, ఆచరణాత్మక ఆలోచనలు వీరిని విజేతగా నిలిపి తీరుతాయి. 

46
కన్యా రాశి

కన్యా రాశి వారికి అధిపతి బుధుడు.ఈ రాశి వారికి వ్యాపారంలో ఎంతో పట్టు ఉంటుంది.  ఎలాంటి వ్యాపారంలోనైనా వీరు విజయం సాధిస్తారు. కన్యా రాశివారు తెలివైనవారు, ఏ విషయాన్నయినా విశ్లేషణాత్మకంగా చూసే నైపుణ్యం వీరికి ఉంటుంది. ప్రతి పనిని ప్రణాళికతో పూర్తి చేస్తారు. ముఖ్యంగా వీరు వైద్య, విద్య, సేవా రంగాల్లో రాణిస్తారు.

56
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి. వీరిది కష్టపడి పనిచేసే తత్వం.  ఇతరులతో పోలిస్తే విభిన్నంగా ఆలోచిస్తారు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారంటే దాన్ని సాధించే వరకు పోరాడతూనే ఉంటారు. వీరి కఠోర శ్రమ ముందు ఓటమే ఓడిపోతుంది.  వీరు ఎప్పటికైనా ఉన్నత స్థానానికి చేరుకుంటారు.

66
ఇతర రాశులు

పైన చెప్పిన రాశులే కాదు… మరికొన్ని రాశులు కూడా విజయాన్ని సాధిస్తారు. వాటిలో మేషం, ధనుస్సు, మకరం రాశులు ముందుంటాయి. 

మేషం:  వీరికి దృఢ సంకల్పం ఎక్కువ. నిర్ణయాలు వేగంగా తీసుకుంటారు. అవే వీరిని గెలిపిస్తాయి. 

ధనుస్సు:  ఈ రాశి వారు ఏం రంగంలో అయినా రాణిస్తారు. 

మకరం: మకరరాశి వారికి కష్టపడి పనిచేసే తత్వం అధికం.  క్రమశిక్షణతో విజయం సాధిస్తారు. 

Read more Photos on
click me!

Recommended Stories