ఈ నాలుగు నెలల్లో జన్మించిన వారు చాలా కన్నింగ్, మాటలతోనే మాయాజాలం చేస్తారు..!

Published : Aug 26, 2025, 02:38 PM IST

ప్రతి విషయంలోనూ ఇతరుల కంటే ఒక అడుగు ముందే ఉంటారు. చాలా చాకచక్యంగా ఉంటారు. మాటలతో మాయాజాలం చేయగల సామర్థ్యం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది.

PREV
15
zodiac signs

జోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జన్మించిన నెల వారి వ్యక్తిత్వాన్ని, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కొన్ని తేదీల్లో జన్మించిన వ్యక్తులు చాలా తెలివితేటలతో ఎలాంటి పరిస్థితులను అయినా సులభంగా మార్చుకోగలరు. ప్రతి విషయంలోనూ ఇతరుల కంటే ఒక అడుగు ముందే ఉంటారు. చాలా చాకచక్యంగా ఉంటారు. మాటలతో మాయాజాలం చేయగల సామర్థ్యం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు కోరుకున్నది సాధించడానికి ఏదైనా చేయగలరు.మరి, ఆ నెలలు ఏంటో చూద్దామా...

25
ఫిబ్రవరి...

ఫిబ్రవరిలో జన్మించిన వ్యక్తులు సహజంగా చాలా తెలివైనవారు. ఇతరుల భావాలను చాలా సులభంగా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. చాలా వినూత్నంగా ఆలోచిస్తారు. ఏ సమస్య వచ్చినా.. అందరిలా కాకుండా.. చాలా తెలివిగా సమస్యలను పరిష్కరించగలరు. ఇతరుల మనసులో విషయాన్ని కూడా వీరు కనిపెట్టగలరు. తమ మాటల మాయాజాలంతో అందరినీ బుట్టలో వేసుకుంటారు.

35
మే

మేలో జన్మించిన వ్యక్తులు చాలా మల్టీ టాలెంటెడ్. అయితే.. ఈ తేదీల్లో పుట్టిన వారు ద్వంద్వ వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు. వీరు ప్రతి విషయంలోనూ చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఇతరుల మనసు కూడా బాగా అర్థం చేసుకుంటారు. మాటలతో మ్యాజిక్ చేసేస్తారు. తమకు కావాల్సిన, నచ్చిన విషయాన్ని చాలా తెలివిగా చేయించుకోగలరు. ఇతరులను బ్రెయిన్ వాష్ చేయడంలో వీరికి వీరే సాటి. వారు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు.ఎవరైనా తమను మోసం చేయాలని చూసినా వీరు వెంటనే పసిగట్టగలరు.

45
సెప్టెంబర్..

సెప్టెంబర్ లో జన్మించిన వారు కూడా చాలా తెలివైన వారు. తమ ఆకర్షణతో అందరినీ సులభంగా ఆకట్టుకుంటారు. తమ అవసరాలను తీర్చుకోవడానికి ఇతరులను చాలా సులభంగా వాడుకుంటారు. ఇతరుల మనసులో విషయాన్ని చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. అందరినీ తమ కంట్రోల్ లో ఉంచుకుంటారు. మాటలతో మాయాజాలం చేస్తారు..

55
అక్టోబర్

అక్టోబర్‌లో జన్మించిన వ్యక్తులు చాలా చాకచక్యంగా ఉంటారు. వీరి దగ్గర చాలా సీక్రెట్స్ ఉంటాయి. ఇతరులు వారిని అర్థం చేసుకోవడం కష్టం. వారు తమ నిజమైన ఉద్దేశాలను, భావాలను దాచడంలో వీరు ది బెస్ట్ అని చెప్పొచ్చు. వారు ఇతరుల అంతర్ దృష్టిని, ఆలోచనలను సులభంగా చదవగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇతరులను మోసం చేసి.. తాము అనుకున్నది సాధించడంలో ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ముందుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories