Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి జీవితంలో డబ్బులోటే రాదు

Published : Dec 01, 2025, 12:17 PM IST

Numerology: ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి వారి జీవితాన్ని ముందుగానే అంచనా వేసి చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీని బట్టి  భవిష్యత్తు, ఉద్యోగం, ప్రవర్తన వంటి ఎన్నో విషయాలను అంచనా వేసి చెబుతుంది.  

PREV
15
వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు

సంఖ్యాశాస్త్రం అంటే న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. పుట్టిన తేదీలోని అంకెలను కలిపితే మూల సంఖ్య వస్తుంది. దీన్ని రాడిక్స్ సంఖ్య అని కూడా పిలుస్తారు. ఆ మూల సంఖ్యను బట్టి ఆ వ్యక్తి స్వభావం, ప్రవర్తన, బలాలు, బలహీనతలు, భవిష్యత్తును ముందుగానే చెప్పవచ్చు.  అయితే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి ఆర్థిక సమస్యలు రావు. అలాగే వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు పూర్తిగా పొందే అవకాశం ఉంది.

25
ఈ తేదీల్లో పుట్టిన వారు...

ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు ఎంతో లక్కీ.  వీరి మూల సంఖ్య 6 అవుతుంది. ఈ సంఖ్యను పాలించేది శుక్రుడు.  శుక్రుడే సంపదకు, శ్రేయస్సుకు, అందానికి, ఆకర్షణకు కారకుడు.  వీరికి ఎంతో కలిసి వస్తుంది. శుక్రుడి వల్ల ఎన్నో సుఖాలను పొందుతారు.

35
డబ్బుకు కొరత ఉండదు

మూల సంఖ్య 6 కలిగిన వ్యక్తులు ఎంతో సంతోషంగా జీవిస్తారు. వీరి జీవితం శ్రేయస్సుతో నిండి ఉంటుంది. వీరికి జీవితాంతం లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. అందుకే ఈ తేదీలలో పుట్టిన వారికి ఎప్పుడూ డబ్బు కొరత రాదు. అవసరానికి కచ్చితంగా డబ్బు చేతికందుతుంది.

45
విలాసవంతమైన వస్తువులు

ఆరు మూలా సంఖ్య ఉన్నవారు ఆర్థికంగా బాగా స్థిరపడతారు.  ధనవంతులు అవుతారు. అలాగే దుబారా ఖర్చు కూడా అధికంగా చేస్తారు.  వీరు ఖరీదైన వాచీలు, బ్యాగులు, ఇళ్లు విలాసవంతమైన వస్తువులను కొనేందుకు ఇష్టపడతారు. జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తారు.

55
పాజిటివ్ గా ఉంటారు

ఈ తేదీలలో జన్మించిన వారు ఎంతో సృజనాత్మకంగా ఉంటారు. వీరు కళల్లో రాణిస్తారు. సంగీతం, ఫ్యాషన్, డిజైన్, వినోదం లాంటి కళారంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు. వీరు చాలా పాజిటివ్‌ ఆలోచనలు కలిగి ఉంటారు. వీరికి ప్రతిచోటా అందరి మనసులను గెలుచుకుంటారు. వీరి నుంచి పాజిటివ్ వైబ్స్ పక్కవారిని కూడా ప్రభావితం చేస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories