డిసెంబర్ నెలలో ఈ రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది! మీ రాశి ఉందో చూడండి

Published : Dec 01, 2025, 12:04 PM IST

December Horoscope: ఈ మాస ఫలాలు డిసెంబర్ నెలకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల మాస ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
మాస ఫలాలు

ఈ మాస ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

మేష రాశివారికి డిసెంబర్ నెల అంతగా అనుకూలించదు. అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మరింత చికాకు కలిగిస్తాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. శ్రమతో కానీ పనులు పూర్తి కావు. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం ఉండదు. 

313
వృషభ రాశి ఫలాలు

వృషభ రాశివారికి కూడా ఈ నెల అంతగా అనుకూలించదు. వృత్తి, వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. భావోద్వేగాలను అదుపులో ఉంచడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా పడతాయి. 

413
మిథున రాశి ఫలాలు

మిథున రాశి వారికి డిసెంబర్ నెల సానుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులలో ఉత్సహంగా ముందుకు సాగుతారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. 

513
కర్కాటక రాశి ఫలాలు

డిసెంబర్ నెల కర్కాటక రాశివారికి మరింత అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకర్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

613
సింహ రాశి ఫలాలు

సింహ రాశివారికి ఈ నెల కలిసివస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభ సాటిగా సాగుతాయి. 

713
కన్య రాశి ఫలాలు

కన్య రాశివారికి ఈ నెల కూడా అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి తెలివిగా బయట పడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధుమిత్రులతో వివాహాది శుభ కార్యాలకు హాజరవుతారు. ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. సంతాన విద్య విషయాలపై దృష్టి సారిస్తారు. గృహ నిర్మాణ పనులు కార్యరూపం దాలుస్తాయి.

813
తుల రాశి ఫలాలు

తుల రాశివారికి డిసెంబర్ నెల మరింత అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంభ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. సంతాన ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. ధన లాభ సూచనలు ఉన్నాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సహన్నిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. 

913
వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల మిశ్రమంగా ఉంటుంది. ఇంటా బయటా పరిస్థితులు కొంతవరకు అనుకూలిస్తాయి. అన్ని వ్యవహారాలలో మొండి వైఖరితో ముందుకి సాగటం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. చేపట్టిన పనులలో తొందరపాటు వల్ల ఆటంకాలు తప్పవు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించక నిరాశ పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశివారికి ఈ నెల అంతగా అనుకూలించదు. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. పిల్లలతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణ పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు.

1113
మకర రాశి ఫలాలు

మకర రాశివారికి డిసెంబర్ నెల అంతగా అనుకూలించదు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. జీవిత భాగస్వామితో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కొత్త సమస్యల వల్ల మానసిక ప్రశాంతత ఉండదు. సంతాన పరమైన సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగుల కష్టం వృథాగా మిగులుతుంది. 

1213
కుంభ రాశి ఫలాలు

కుంభ రాశివారికి డిసెంబర్ నెల అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. 

1313
మీన రాశి ఫలాలు

మీన రాశివారికి డిసెంబర్ నెల అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శత్రు పరమైన సమస్యలపై విజయం సాధిస్తారు. స్త్రీల వల్ల ధన లాభాలు కలుగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులు శాలరీ విషయంలో శుభవార్తలు వింటారు. 

Read more Photos on
click me!

Recommended Stories