Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై లక్ష్మీ కటాక్షం.. డబ్బుకు లోటే ఉండదు..!

Published : Sep 27, 2025, 11:20 AM IST

Birth Date:  లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని చాలా మంది అనుకుంటారు. ఆ తల్లి కృప ఉన్నవారికి జీవితంలో డబ్బు విషయంలో ఎలాంటి లోటు ఉండదు. కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారికి సహజంగా లక్ష్మీ దేవి కటాక్షం ఉంటుంది. 

PREV
15
Birth Date

న్యూమరాలజీ ప్రకారం, మనం పుట్టిన తేదీని మన జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కాగా, కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీని వల్ల.... ఆ తేదీల్లో జన్మించిన వారికి డబ్బు కొరత ఉండదు. అంటే....వారి దగ్గర డబ్బు లేకపోయినా.. అవసరానికి ఎక్కడి నుంచి అయినా అందుతుంది. అంతేకాదు.... వారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. సంతోషకరమైన జీవితాన్ని గడపగలరు. జీవితం చాలా హ్యాపీగా గడిచిపోతుంది. మరి, ఆ తేదీలేంటో చూద్దామా.....

25
నెంబర్ 1....

న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 1 కి చెందిన వారి జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారంతా ఈ నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారిపై లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. వీరికి డబ్బు లోటు ఉండదు. ఏదో ఒక వైపు నుంచి వీరికి డబ్బు అందుతుంది. మంచి రాజు లాంటి జీవితం గడుపుతారు. ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.

35
నెంబర్ 3...

ఏ నెలలో అయినా 3, 12, 21,30 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారిపై కూడా లక్ష్మీదేవి కృప అపారంగా ఉంటుంది. అంతేకాదు.. ఈ తేదీల్లో జన్మించిన వారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ. జీవితంలో ఎక్కువ సంపదను సంపాదించగలరు. సంతోషమైన, సంపన్నమైన జీవితాన్ని గడుపుతారు. వీరికి సమాజంలో గౌరవం, కీర్తి ఎక్కువగా లభిస్తాయి.

45
నెంబర్ 5...

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారంతా కూడా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై కూడా లక్ష్మీదేవి కృప చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి డబ్బు లోటు ఉండదు. జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లగలరు. గొప్ప పురోగతి కూడా సాధించగలరు. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవారికి చాలా బాగా కలిసొస్తుంది.

55
నెంబర్ 6...

సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలోనైనా 6, 15 , 24 తేదీలలో జన్మించిన వారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. ఈ 6 నెంబర్ కి శుక్రుడు అధిపతి. అందుకే.. వీరికి కూడా లక్ష్మీ దేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. వీరికి డబ్బు లోటు అనేదే ఉండదు. మంచి లగ్జరీ లైఫ్ ని గడపగలరు. వీరి జీవితం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories