నెంబర్ 6..
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. నెంబర్ 6కి శుక్రుడు అధిపతి. వీరు సాధారణంగా విలాసవంతమైన జీవితాన్ని, అందాన్ని, సౌకర్యాలను కోరుకుంటారు.
వీరు చాలా సెన్సిటివ్. ఆఫీసులో గొడవలు ఉన్నా లేదా వాతావరణం అస్తవ్యస్తంగా ఉన్నా వీరు అక్కడ ఉండలేరు. అందమైన, ప్రశాంతమైన ఆఫీసు సెటప్ వీరికి చాలా ముఖ్యం. వీరు చేసే పనికి తగిన గుర్తింపు లేదా ప్రశంసలు లభించకపోతే, తమను తక్కువ చేస్తున్నారని భావించి వెంటనే వేరే చోటికి వెళ్లిపోతారు.
అంతేకాదు..వీరు పుట్టుకతోనే కళాకారులు. ఏదైనా పనిలో సృజనాత్మకత (Creativity) లేకపోతే వీరికి త్వరగా బోర్ కొడుతుంది. వీరు ఎక్కువగా ఫ్యాషన్, మీడియా, హోటల్ మేనేజ్‌మెంట్ లేదా జువెలరీ వంటి గ్లామర్, క్రియేటివ్ రంగాల్లో ఉంటే స్థిరంగా ఉంటారు.