Birth Date: ఈ తేదీలలో పుట్టిన వారికి విపరీతమైన ఇగో.. వీరితో స్నేహం, శత్రుత్వం రెండూ డేంజరే

Published : Mar 20, 2026, 02:39 PM IST

Birth Date: మన జీవితంలో ఎంతో మంది ఉంటారు. అందరి స్వభావం ఒకేలా ఉండదు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవాళ్లతో చిన్న గొడవ కూడా పెట్టుకోకూడదు. వాళ్లు అంత త్వరగా క్షమించరు. మిమ్మల్ని జీవితాంతం శత్రువుల్లా చూస్తారు.

PREV
14
వీరికి అహంకారం ఎక్కువ

సంఖ్యాశాస్త్రం మనం పుట్టిన తేదీని బట్టి మన స్వభావాన్ని అంచనా వేసి చెబుతుంది.  కొన్ని ప్రత్యేకమైన రాడిక్స్ నంబర్లు అంటే మూల సంఖ్య కలిగి ఉన్నవారితో గొడవలు పెట్టుకోకూడదు. వారి అహం దెబ్బతింటే చాలు మిమ్మల్ని జీవితాంతం క్షమించరు. అలాంటి మూడు రాడిక్స్ నెంబర్లు ఇవే.

24
రాడిక్స్ నంబర్ 1

ఏ నెలలోనైనా 1,20,19, 28 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. 1 నంబర్‌కు అధిపతి సూర్యుడు. ఈ తేదీలలో పుట్టిన వారిపై సూర్యుడి ప్రభావం అధికం. అందుకే వీరికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. వీరి అహానికి దెబ్బ తగిలితే ఎవరి మాటా వినరు. వీరి మనసును గాయపరిస్తే  వాళ్లను జీవితాంతం శత్రువుల్లా చూస్తారు. పూర్తిగా మాట్లాడటమే మానేస్తారు. ఏ విషయాన్నైనా దాచుకోకుండా ముఖం మీదే చెప్పేస్తారు వీరు.

34
రాడిక్స్ నంబర్ 8

ఏ నెలలోనైనా 8, 17, 26వ తేదీలలో పుట్టిన రాడిక్స్ సంఖ్య 8 అవుతుంది.  ఈ రాడిక్స్ నంబర్‌కు అధిపతి శని. శని ప్రభావం వల్ల వీరెంతో కష్టపడతారు. వీరు చాలా గంభీరంగా ఉంటారు. వీరికి జనాల్లో కలిసి ఉండడం పెద్దగా నచ్చవు. ఒంటరిగా లేదా తక్కువ మందిలో కలిసి ఉండేందుకు ఇష్టపడతారు. అలాగే వీరికి సహనం చాలా ఎక్కువ. కానీ ఎవరైనా వీరికి తీవ్రంగా బాధిస్తే మాత్రం వారిని జీవితాంతం మర్చిపోరు. 

44
రాడిక్స్ నంబర్ 9

ఏ నెలలోనైనా 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారి  రాడిక్స్ నంబర్‌ 9 అవుతుంది. ఈ అంకెకు అధిపతి కుజుడు. కుజుడి ప్రభావం వల్ల వీరు చాలా శక్తివంతమైనవారిగా ఉంటారు. ఈ తేదీలలో పుట్టిన వారికి ఎలాంటి భయం ఉండదు.  రిస్క్ తీసుకునేందుకు ముందుంటారు. వీరు తమ గురించి చెడుగా మాట్లాడితే ఏమాత్రం సహించరు. వీరు అవమానాన్ని మాత్రం తట్టుకోలేరు. ఎవరైనా వీరిని అవమానించాలని చూస్తే భయపడకుండా గట్టిగా బదులిస్తారు. 

Read more Photos on
click me!

Recommended Stories