Ugadi RashiPhalalu: విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశి ఫలితాలు
2025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో చివరి రాశి అయిన మీన రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.
2025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో చివరి రాశి అయిన మీన రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.
మీన రాశి ఆదాయం-05, వ్యయం-05,రాజ్యపూజ్యం-03, అవమానం-01
2025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో చివరి రాశి అయిన మీన రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.
విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశివారికి మధ్యస్థంగా ఉండనుంది.ఈ ఉగాది రోజునే శని మీన రాశిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ శని జన్మరాశి సంచారం వల్ల కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు. గురుడు అనుకూల స్థానంలో ఉండటంతో కొన్ని శుభ ఫలితాలు అందుకుంటారు. రాహువు, కేతువు సంచారం వల్ల కొన్ని అనుకోని మార్పులు,ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, ధైర్యం, పట్టుదలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది.
విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశి ఆర్థిక పరిస్థితి
ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాహువు ద్వాదశ రాశి సంచారం వల్ల ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. జాగ్రత్తగా ఆర్థిక వ్యవహారాలు నిర్వహించాలి. వ్యాపారస్తులు పెట్టుబడులకు శ్రద్ధ వహించాలి. సరైన ప్రణాళికలతో వెళితే మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఆకస్మిక ధన లాభాలు కూడా పొందే అవకాశం ఉంటుంది.
విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశి ఆరోగ్య పరిస్థితి
ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఎదురుకావచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శనివారం తైలాభిషేకం చేయడం, ధ్యానం, యోగం వంటివి చేయడం మంచిది.
విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశి ఉద్యోగ వ్యాపార పరిస్థితి
ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఒత్తిళ్లు, ఒడిదుడుకులు ఉంటాయి. బదిలీలు, కొత్త బాధ్యతలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు వేయాలంటే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొంతకాలానికి పరిస్థితి మెరుగవుతుంది.
మాస ఫలితాలు
ఏప్రిల్ 2025: ఈ నెల కొంత ప్రతికూలంగా ఉంటుంది. ధన నష్టాలు, శారీరక అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఎదుర్కొంటారు.
మే 2025: మిశ్రమ ఫలితాలు. కుటుంబంలో మార్పులు, ఇతరులతో అభిప్రాయ బేధాలు ఏర్పడతాయి.
జూన్ 2025: ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ధన లాభం, శుభకార్యాలలో పాల్గొనడం, మానసిక ఆనందం ఉంటుంది.
జూలై 2025: కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం.
ఆగస్టు 2025: అనుకోని ఖర్చులు, ఆస్తి వివాదాలు, ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
సెప్టెంబర్ 2025: విద్యార్థులకు అనుకూలం, శుభకార్యాలకు శ్రీకారం చుట్టే అవకాశం.
అక్టోబర్ 2025: అనుకున్న పనులు పూర్తికావు, అనవసర ఖర్చులు, ప్రేమ సంబంధాలకు అనుకూలం.
నవంబర్ 2025: ఉద్యోగస్తులకు బదిలీలు, కొత్త అవకాశాలు, ఊహించని ఖర్చులు.
డిసెంబర్ 2025: వ్యాపార లాభాలు, కొత్త పరిచయాలు, అనారోగ్య సమస్యలు.
జనవరి 2026: వాహన సౌఖ్యం, కొత్త ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక ఇబ్బందులు.
ఫిబ్రవరి 2026: వృత్తి, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక ఇబ్బందులు, భూసంబంధ మార్పులు.
మార్చి 2026: కుటుంబంలో విరోధాలు, ఆలయ దర్శనం, వ్యాపారంలో జాగ్రత్త అవసరం.
శ్రీ గురు దక్షిణామూర్తిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.