
ఈ రోజుల్లో అయినవాళ్లే సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. కష్టాల్లో ఉన్నారంటే కనీసం ముఖం కూడా చూపించడం లేదు. ఇలాంటి వారి మధ్యలో బంగారం లాంటి మనసు ఉన్నవారు కూడా ఉన్నారంటే నమ్ముతారా? ప్రపంచం ఎంత కఠినంగా మారుతున్నా.. కొందరు వ్యక్తులు తమలోని అమాయకత్వాన్ని, సహనాన్ని, ప్రేమను, కరుణను వదులుకోలేరు. వారు ఇతరుల బాధను తమదిగా భావించి, ఎప్పుడూ సహాయం చేయడానికి ముందుంటారు. ఇంత మంచి మనసు ఉన్నవారు మనకు దొరకడం చాలా అదృష్టం అనే చెప్పాలి. న్యూమరాలజీ ప్రకారం.. ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని మనం చాలా సులభంగా గుర్తించొచ్చు. ముఖ్యంగా.. కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారిలో ఇలాంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మరి, ఆ తేదీలేంటో చూసేద్దామా...
న్యూమరాలజీ ప్రకారం, నాలుగు తేదీల్లో జన్మించిన వారికి సహజంగా, పుట్టుకతోనే కొన్ని మంచి లక్షణాలు వస్తాయి. వారు అందరితోనూ చాలా ప్రేమగా వ్యవహరిస్తారు. చాలా దయతో ఉంటారు.
ఏ నెలలో అయినా 2వ తేదీలో జన్మించిన వారు సహజంగానే చాలా దయతో ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు తమ కుటుంబ సభ్యులు అందరితోనూ ప్రేమగా ఉంటారు. తెలియని వాళ్లతో అయినా చాలా మృదువుగా మాట్లాడతారు. ఎవరినైనా అర్థం చేసుకోగల మనస్తత్వం వీరిది. ఎదుటివారు తమ కష్టాన్ని చెప్పకపోయినా వీరు అర్థం చేసుకునే గొప్ప మనసు వీరిది. వీరితో ఎవరైనా తమ కష్టాన్ని చెప్పుకోగలరు. వీరు కూడా చాలా బాగా అర్థం చేసుకుంటారు. అంతేకాదు, ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇతరుల కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికి అయినా వీరు ముందుంటారు. అందరికీ ప్రేమ పంచడానికి ముందుంటారు.
ఏ నెలలో అయినా నెంబర్ 6 వ తేదీలో పుట్టినవారు కుటుంబ అనురాగానికి మారుపేరు. వీరు సహజంగానే చాలా శ్రద్ధగా ఉంటారు. బాధ్యతతో వ్యవహరిస్తారు. ఎవరితో అయినా నిస్వార్థం లేకుండా స్నేహం చేస్తారు. వీరితో ఉంటే ఎవరికైనా సురక్షితంగా ఉన్నాం అనే భావన కలుగుతుంది. వీరి వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే భావనతో ఉండరు. అందరినీ సమానంగా చూస్తారు. ఎవరికి ఎలాంటి కష్టం ఉన్నా తీర్చడంలో ముందుంటారు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా, వీరికి నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఓపికగా విని, ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు.
ఏ నెలలో అయినా 15వ తేదీలో పుట్టిన వారు కూడా చాలా మంచి మనసు కలిగి ఉంటారు. వీరు జీవితంలో ఎక్కువగా స్వేచ్ఛను కోరుకుంటారు. వీరి వ్యక్తిత్వం చాలా గొప్పది. వీరు జీవితంలో చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. సృజనాత్మకతతో ముందుకు సాగుతారు. ఈ తేదీల్లో జన్మించినవారు ఎవరి మనసు అయినా అర్థం చేసుకుంటారు. మనసులో మాటను కూడా వారు చెప్పకుండానే తెలుసుకుంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు ఏది కావాలన్నా వీరు చెప్పకుండానే తెలిసి, వీరు అర్థం చేసుకుంటారు. వారికి కావాల్సినవి తెచ్చి ఇస్తారు. వీరి సమీపంలో ఉండే వ్యక్తులు తమ నిజమైన వ్యక్తిత్వాన్ని బయటపెట్టే ధైర్యాన్ని పొందుతారు.
ఏ నెలలో అయినా 20వ తేదీలో జన్మించిన వారు తమ కుటుంబానికి, బంధానికి ఎక్కువ విలువ ఇస్తారు. వారి కుటుంబ సభ్యుల మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. వీరు చాలా నమ్మకమైన వ్యక్తులు. అంకితభావంతో పనిచేస్తారు. ప్రేమ, అనుబంధం, మానవత్వం వంటి విలువల కోసం మాత్రమే వీరు జీవిస్తారు. ఇతరుల కోసం ఏది చేయడానికి అయినా వీరు వెనకాడరు. అవసరం అయితే తమ విజయాన్ని త్యాగం చేయడానికి కూడా వెనకాడరు. అందరి పట్లా చాలా సానుభూతితో ఉంటారు. వీరు అందరికీ ప్రేమను మాత్రమే కాదు.. ప్రశాంతతను కూడా పంచిపెడతారు.
ఈ నాలుగు తేదీల్లో జన్మించిన వారు.. ప్రేమ, దయ, ఆదరణ, ఆదర్శం వంటి విలువలకు నిలయాలుగా నిలుస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు తమ పరిసరాలను కాంతితో, ప్రేమతో నింపగలరు. ఈ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు మన ఆశకు, నమ్మకానికి చిహ్నాలుగా నిలుస్తారు. వీరి బంగారు మనసుకు ఎవరినైనా ఫిదా అయిపోవాల్సిందే.