సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా ఒక ములాంకాన్ని నిర్ణయిస్తారు. ఈ ములాంకాన్ని బట్టి వ్యక్తి ఆలోచన విధానం, స్వభావం, జీవన శైలి, ప్రేమ జీవితం వంటివి ఆధారపడి ఉంటాయి. జ్యోతిష పండితులు చెబుతున్న ప్రకారం ఏ నెలలోనైనా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారి మూల సంఖ్య 4. అంటే మీ పుట్టిన తేదీలోని అంకెలను కలిపితే మూల సంఖ్య వస్తుంది. 4 మూలా సంఖ్యతో సంబంధం కలిగి ఉన్న గ్రహం రాహువు. రాహు ప్రభావం వల్ల ములాంక్ 4 వ్యక్తులు ఇతరులకంటే ఎంతో భిన్నంగా ఆలోచిస్తారు. వీరి జీవితంలో ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యక్తుల ప్రేమ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీరు ప్రేమలో చాలా పొసెసివ్ నెస్ తో ఉంటారు. వీరిది అతి ప్రేమ. దాన్ని తట్టుకోవడం చాలా కష్టం.