Jupiter Direct Movement: సవ్యమార్గంలోకి గురు గ్రహం, 5 రాశుల వారికి పట్టనున్న అదృష్టం

Published : Jan 21, 2026, 11:28 AM IST

Jupiter Direct Movement: బృహస్పతి అంటే గురుగ్రహం వక్ర గమనాన్ని ముగించి సవ్యమార్గంలోకి  కదలబోతున్నాడు. దీనివల్ల 4 రాశుల వారికి విపరీతమైన ప్రయోజనం కలుగులతుంది. మార్చి నుంచి వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. 

PREV
15
మేష రాశి

మేషరాశి వారికి  గురుగ్రహం వల్ల మంచి రోజులు రాబోతున్నాయి. ఈ రాశి వారి ఇంట్లో 3వ స్థానంలో గురుడు సవ్యదిశలో సంచరించబోతున్నాడు. దీని వల్ల వీరి జీవితంలో గందరగోళం తొలగిపోతుంది. వీరికి మార్చి నెల నుంచి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అర్థాంతరంగా ఆగిపోయిన  పనులు పూర్తవుతాయి. ఈ రాశి విద్యార్థులు విజయం సాధిస్తారు.

25
వృషభం

వృషభ రాశికి గురుడి మార్గ సంచారం ఎన్నో మంచి ఫలితాలనిస్తాయి. ఈ రాశి వారి 2వ ఇంట్లో గురు గ్రహం సంచారం వల్ల  వీరి ఆదాయం అమాంతం పెరుగుతుంది. వీరికున్న ఆర్థిక సమస్యలు దాదాపు తీరిపోతాయి. ఈ రాశి వారి కుటుంబంలో ఏవైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.  వీరి జీవితంలో ఉన్న మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది.

35
సింహ రాశి

సింహ రాశికి గురు గ్రహ సంచారం ఎన్నో మంచి విశేష ఫలితాలను అందిస్తుంది. 11వ ఇంట్లో సంచారం వల్ల ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు సింహ రాశి వారికి తెరుచుకుంటాయి. పెట్టుబడుల ద్వారా వీరు ఎన్నో లాభాలు పొందుతారు. వీరి కోరికలు నెరవేరుతాయి.

45
ధనుస్సు రాశి

ధనుస్సు రాశికి వారికి మార్చిలో మంచి రోజులు రాబోతున్నాయి. ఆ రాశి వారి 7వ ఇంట్లో గురుడు సవ్య దిశలో సంచరించడం వల్ల వివాహ ఆటంకాలు తొలగిపోతాయి. వీరికి పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక  భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి విభేదాలు తొలగిపోతాయి. వీరు చేసే వ్యాపారం వృద్ధి చెందుతుంది. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.

55
మీన రాశి

మీన రాశి వారికి మార్చిలో అనుకున్న పనులు నెరవేరుతాయి. గురుడి మార్గ సంచారం ఈ రాశి వారికి  అనుకూల మార్పులను తెచ్చిపెడుతుంది.  ఈ రాశి వారి 4వ ఇంట్లో గురు సంచారం వల్ల సౌకర్యాలు పెరుగుతాయి. ఇల్లు, వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories