న్యూమరాలజీ ప్రకారం 1, 5, 6 తేదీల్లో పుట్టినవారు సహజంగానే నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. 1వ తేదీన పుట్టినవారు సూర్యుడి ప్రభావంతో ఉంటారు. వీరికి నిర్ణయాలు తీసుకునే శక్తి ఎక్కువగా ఉండటం వల్ల బిజినెస్, మేనెజ్‌మెంట్, ప్రభుత్వ సంబంధిత రంగాల్లో డబ్బు అవకాశాలు ఎక్కువగా వస్తాయి. వీరు డబ్బు వెనుకపడరు. కానీ వీరి ఆలోచనలు, ఆత్మవిశ్వాసమే డబ్బును ఆకర్షిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.