Saturn Venus Conjunction: శని శుక్రుల కలయికతో ఈ రాశులకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి

Published : Feb 03, 2026, 01:08 PM IST

Saturn Venus Conjunction: మరికొన్ని రోజుల్లో అంటే మార్చి 4, 2026 సాయంత్రం శని శుక్ర సంయోగం జరగబోతోంది. ఈ శని, శుక్రుల కలయిక ఈ 5 రాశుల వారి జీవితమే మారిపోతుంది. ఇది అర్ధ కేంద్ర రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఇది అకస్మాత్తుగా ధనలాభాలను అందిస్తుంది. 

PREV
15
వృషభ రాశి

వృషభ రాశిని పాలించేది శుక్రుడు. ఇక శని గ్రహం రాజయోగానికి కారకుడు. కాబట్టి వీరిద్దరి సంయోగం అనేది ఈ రాశివారి కెరీర్‌లో గొప్ప ఎదుగుదలకు కారణం అవుతుంది. ఈ రాశి వారు  కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే ఇదే  మంచి సమయం అని చెప్పుకోవాలి.  వీరికి పూర్వీకుల ఆస్తి వివాదాలు తీరిపోయి.. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. 

25
మిథున రాశి

మిథున రాశి వారికి శని శుక్రుల కలయిక వల్ల అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. సమాజంలో వీరి హోదా పెరుగుతుంది. విదేశీ ప్రయాణం లేదా ఉన్నత విద్య కలలు కనేవారి కోరికలు ఈ సమయంలో నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మరింత బలంగా మారుతుంది.

35
కన్యా రాశి

శని, శుక్రుల ఈ కలయిక కన్యా రాశి వారికి 7వ ఇంటిపై ప్రభావం చూపిస్తుంది. ఇది భాగస్వామ్యం, వైవాహిక జీవితాన్ని సూచించే ఇల్లు. దీని వల్ల మీ భాగస్వామితో మీ సంబంధం మరింత అందంగా మారుతుంది. మీ భాగస్వామి మద్దతుతో మంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇక వ్యాపారంలో భాగస్వామ్యంలో ఉన్న వారు లాభాలను చూస్తారు.  కోర్టు కేసులలో  వీరు విజయం సాధించే అవకాశం ఉంది.

45
కుంభ రాశి

శనీశ్వరుడు ప్రస్తుతం కుంభ రాశిలోనే సంచరిస్తున్నాడు. ఇతడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మంచి మైలురాయిని చేరుకుంటారు. అర్ధ కేంద్ర రాజయోగం ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం కొత్త ఎత్తులకు చేరుకుంటుంది. ఇక ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్, ఇంక్రిమెంట్  వంటివి అందే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో కుంభరాశి వారి సంపద బాగా పెరుగుతుంది.

55
మీన రాశి

అర్థకేంద్ర యోగం వల్ల మీన రాశి వారికి బీభత్సంగా కలిసివస్తుంది. ఈ రాశికి చాలా సానుకూల ఫలితాలను తెస్తుంది. వాహనం లేదా ఇల్లు వంటి ఆస్తులు కొనే అవకాశం ఉంది.  సృజనాత్మక రంగాలలో పనిచేస్తున్న వారికి మంచి కీర్తి, సంపదను పొందే అవకాశం ఉంది.  వీరికి దైవిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories