జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి తేదీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టినవారు చాలా ప్రశాంతంగా ఉంటే.. మరికొన్ని తేదీల్లో పుట్టినవారు చాలా మొండిగా ఉంటారు. తాము చెప్పిందే జరిగి తీరాలి అనుకుంటారు. అలాంటి వారిని భరించడం చాలా కష్టం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారు చాలా మొండిగా ఉంటారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎవ్వరు ఏం చెప్పినా వినరు. వారు నమ్మిందే నిజమని ముందుకు సాగుతారు. ఈ లక్షణం వల్ల కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బంది కలగవచ్చు. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు వీరిని భరించడం చాలా కష్టం అనే భావనలో ఉంటారు. మరి ఏ తేదీల్లో పుట్టినవారికి మొండితనం ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందామా…
25
1, 5, 9, 12 తేదీల్లో పుట్టినవారు
ఏ నెలలో అయిన 1, 5, 9, 12 తేదీల్లో పుట్టినవారిలో తక్షణ నిర్ణయశక్తి, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏదైనా పని మొదలుపెడితే.. పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. కానీ తక్షణ నిర్ణయాల వల్ల పొరపాట్లు జరిగే అవకాశం ఎక్కువ. అయితే ఏ పరిస్థితిలోనూ వీరు తమ నిర్ణయాన్ని మార్చుకోరు. ఇతరుల అభిప్రాయం, సలహా అస్సలు పట్టించుకోరు. ఈ స్వభావం ఇతరులకు ఇబ్బందిగా అనిపిస్తుంది.
35
18, 21, 25, 28 తేదీల్లో పుట్టినవారు
ఏ నెలలో అయినా 18, 21, 25, 28 తేదీల్లో పుట్టినవారిలో మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి నిర్ణయాలు ఎక్కువగా భావోద్వేగాలతో, లోతైన విశ్వాసంతో ఉంటాయి. కాబట్టి పొరపాటున కూడా వీరు నిర్ణయాలు మార్చుకోరు. ఈ స్వభావం వీరిని మొండివారిగా చూపిస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 30, 31 తేదీల్లో పుట్టినవారు బలమైన వ్యక్తిత్వానికి, పట్టుదలకు ప్రతీక. వీరి మొండితనం కొన్నిసార్లు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే వీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారు. దాన్ని మార్చడం అసాధ్యం.
55
వీరిని అర్థం చేసుకోవాలంటే..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 1, 5, 9, 12, 18, 21, 25, 28, 30, 31 తేదీల్లో పుట్టిన వారి పట్టుదల, ధైర్యం… కొన్నిసార్లు స్థిరత్వాన్ని, మరికొన్నిసార్లు మొండితన్నాన్ని చూపిస్తుంది. ఈ మొండితనం కొన్నిసార్లు సంబంధాల్లో, స్నేహాల్లో, కుటుంబాల్లో ఒత్తిడి సృష్టిస్తుంది. ఎవరైనా వీరి నిర్ణయాన్ని లేదా అభిప్రాయాన్ని ప్రశ్నిస్తే, ఆ సందర్భంలో వారి మొండితనం మరింత బలంగా బయటకు వస్తుంది. ఈ తేదీల్లో పుట్టినవారిని అర్థం చేసుకోవాలంటే ఓపిక, సహనం, ప్రేమ చాలా ఎక్కువగా ఉండాలి.