డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. కొందరు బాగా సంపాదించినా చేతిలో డబ్బు ఉండదు. మరికొందరికి సాధారణ ఆదాయం ఉన్నా ఆర్థికంగా బలంగా ఉంటారు. మరి ఏ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో స్మార్ట్ గా ఉంటారో ఇక్కడ చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం ప్రకారం.. పుట్టిన తేదీ, మన ఆలోచనా విధానం, నిర్ణయాలు, ముఖ్యంగా డబ్బు విషయంలో మన వైఖరిపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా డబ్బులు ప్రతి ఒక్కరూ సంపాదిస్తారు, కానీ కొంతమంది మాత్రమే డబ్బును ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా పెంపు చేసుకోవాలి అనే విషయంలో తెలివిగా వ్యవహరిస్తారు. జ్యోతిష్య పండితుల ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టినవారికి సహజంగానే ఆర్థిక విషయాల్లో స్పష్టత, ముందుచూపు ఉంటుంది. ఆ తేదీలేంటో చూసేయండి.
25
1వ తేదీ- సూర్యుడి ప్రభావం..
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 1 వ తేదీన పుట్టినవారు సూర్యుడి ప్రభావంలో ఉంటారు. సూర్యుడు నాయకత్వం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఈ తేదీన పుట్టినవారు డబ్బు విషయంలో రిస్క్ తీసుకోవడానికి భయపడరు. కానీ ఆ రిస్క్ కూడా లెక్కలు వేసుకొని తీసుకుంటారు. జ్యోతిష్య పండితుల ప్రకారం, వీళ్లు తమ సంపాదనపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా ఎదగాలనే తపన వీరిలో ఎక్కువ. ఖర్చు చేసే ముందు ఆలోచించడం, భవిష్యత్తు కోసం సేవ్ చేయడం వీళ్ల సహజ స్వభావం. అందుకే 1 తేదీన పుట్టినవారు లేట్ గా అయినా ఆర్థికంగా బలంగా నిలబడతారు.
35
5వ తేదీ- బుధుడి ప్రభావం
ఏ నెలలో అయినా 5వ తేదీన పుట్టినవారు బుధుడి ప్రభావంలో ఉంటారు. బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్, వ్యాపార నైపుణ్యాలకు కారకుడు. ఈ తేదీన పుట్టినవారు డబ్బును ఎలా పెంపు చేయాలి అన్న విషయంపై క్లియర్ గా ఉంటారు. వీళ్లు ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడరు. పండితుల ప్రకారం, వీళ్లకు కొత్త అవకాశాలు కనిపెట్టే శక్తి ఉంటుంది. చిన్న పెట్టుబడితో పెద్ద లాభం ఎలా పొందాలో వీళ్లకు బాగా తెలుసు. ఖర్చు విషయంలో కొంచెం చంచలంగా ఉన్నా, అవసరమైన సమయంలో డబ్బును కంట్రోల్ చేయగలగడం వీరి ప్రత్యేకత.
సంఖ్యా శాస్త్రం ప్రకారం 6వ తేదీన పుట్టినవారు శుక్రుడి అధీనంలో ఉంటారు. శుక్రుడు సంపద, సౌఖ్యం, విలాసానికి ప్రతీక. కానీ వీళ్ల తెలివితేటలు కేవలం ఖర్చు చేయడంలోనే కాదు, సేవింగ్స్ లో కూడా ఉంటాయి. జ్యోతిష్య నిపుణుల ప్రకారం, 6వ తేదీన పుట్టినవారు డబ్బును, జీవితాన్ని సుఖంగా మార్చే సాధనంగా చూస్తారు. కానీ అవసరం లేని చోట ఖర్చు పెట్టరు. కుటుంబం, భవిష్యత్తు భద్రత కోసం సేవింగ్స్ చేయడం వీళ్లకు చాలా ముఖ్యం. వీళ్లు డబ్బును ఆకర్షించే శక్తి కలిగి ఉంటారని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి.
55
8వ తేదీ- శని ప్రభావం
ఏ నెలలో అయినా 8వ తేదీన పుట్టినవారు శనిగ్రహ ప్రభావంలో ఉంటారు. శని కష్టానికి, క్రమశిక్షణకు, దీర్ఘకాల ఫలితాలకు కారకుడు. ఈ తేదీన పుట్టినవారికి డబ్బు సులభంగా రాదు, కానీ వచ్చిన డబ్బు చాలా కాలం నిలబడుతుంది. పండితుల ప్రకారం, వీళ్లు ఆర్థిక విషయాల్లో చాలా గంభీరంగా ఆలోచిస్తారు. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. పెట్టుబడుల విషయంలో దీర్ఘకాల ప్రయోజనాన్ని చూస్తారు. చిన్న లాభాల కంటే పెద్ద లక్ష్యాల మీదే వీళ్ల దృష్టి ఎక్కువగా ఉంటుంది.