Mars Transit: అభిజిత్ నక్షత్రంలోకి కుజుడు సంచారం, ఈ 4 రాశుల వారి దశ తిరిగినట్టే

Published : Jan 26, 2026, 09:46 AM IST

Mars Transit: నక్షత్రాలలో 28వది అభిజిత్ నక్షత్రం. ఇది శుభప్రదమైనది, దోషరహితమైనది. కుజుడు నక్షత్రంలోకి జనవరి 24న ప్రవేశించాడు. జనవరి 30 వరకు అక్కడే ఉంటాడు. ఈ మధ్యకాలంలో నాలుగు రాశుల వారికి అధికంగా కలిసి వస్తుంది. 

PREV
14
మేష రాశి

ఈ రాశి వారికి అభిజిత్ నక్షత్రంలో కుజుడు ప్రవేశించడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంపదలో కూడా పెరుగుదల కనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వీరు తీసుకున్న నిర్ణయాలు ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి.

24
సింహ రాశి

అభిజిత్ నక్షత్రంలో కుజుడు సంచారం సింహ రాశి వారికి ఉన్నతమైన గౌరవాన్ని తెచ్చిపెడతాయి. వీరు తమ శత్రువులను ఓడించగలుగుతారు. రాజకీయాల్లో ఉన్నవారికి బలం పెరుగుతుంది. పనిచేసే చోట కూడా గౌరవం లభిస్తుంది. అలాగే పదవులు, కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. ఆర్ధికంగా కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

34
వృశ్చిక రాశి

నక్షత్రంలో కుజుడు సంచారం వల్ల వృశ్చిక రాశి వారు ఎదుగుతారు. కష్టమైన పరిస్థితులను కూడా అధిగమించడానికి వీరికి కావలసిన ధైర్యం దక్కుతుంది. ఏ నిర్ణయాలు తీసుకోవడంలో పనులు మొదలుపెట్టడంలో ధైర్యంగా ముందుకు వెళతారు. ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్నవారికి అద్భుతమైన విజయాలు దక్కుతాయి. వారి జీవితాల్లో ఎన్నో సానుకూల మార్పులు కలుగుతాయి. మానసిక వృత్తిని కూడా చాలా వరకు తగ్గిపోతుంది.

44
మీన రాశి

మీన రాశి వారికి అభిజిత్ నక్షత్రంలోకి కుజుడు వెళ్లడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు పడే కష్టానికి ఫలితం దక్కుతుంది. కెరీర్ లో కూడా మంచి స్థాయికి చేరుకుంటారు. పనిచేసే చోట పెద్ద బాధ్యతలు దక్కుతాయి. ఆర్థిక స్థిరత్వం వస్తుంది. పెండింగ్లో ఉండిపోయిన డబ్బులు అన్ని చేతికందుతాయి. జీవితంలో క్రమశిక్షణ పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories