నెంబర్ 5...
ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. నియమాలు, నిబంధనలు వీరికి ఇష్టం ఉండదు. కొత్త అనుభవాలు, ప్రయాణాలు చేయడం వీరికి నచ్చుతాయి. ఈ స్వభావం కారణంగా వీరు కొత్త బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడరు. ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు.
నెంబర్ 7...
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 7 కిందకు వస్తారు. వీరు తమ భావాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. వీరు తొందరగా ఇతరులను నమ్మరు. తమకు సంబంధించిన సీక్రెట్స్ ని ఎవరితోనూ పంచుకోరు. ఎవరినీ నమ్మకపోవడం వల్ల వీరు ఎక్కువ కాలం సింగిల్ గా ఉండిపోతారు.
ఫైనల్ గా...
సింగిల్‌గా ఉండటం లోపం కాదు. ఇది వ్యక్తిగత ఎంపిక మాత్రమే. న్యూమరాలజీ సూచనలు మన స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు సహాయపడతాయి కానీ జీవితం మన నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు సరైన వ్యక్తి తప్పక జీవితంలోకి వస్తారు.