సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారి జీవితం చాలా స్లోగా ఉంటుంది. వీరికి మంచి చదువు, టాలెంట్ ఉన్నప్పటికీ త్వరగా సెటిల్ కారు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు మాత్రం వీరి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం కూడా రాదు.
జీవితంలో కొందరు చిన్న వయసులో స్థిరపడితే, మరికొందరి ప్రయాణం మాత్రం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. చదువు, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం, పేరు, ప్రతిష్ఠ విషయంలో ఆలస్యం అనిపించినా, చివరికి వారు సాధించే విజయం మాత్రం అసాధారణంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో జన్మించినవారు జీవిత ప్రారంభ దశలో పరీక్షలు ఎదుర్కొన్నా, కాలక్రమేణా గొప్ప స్థాయిలో సెటిల్ అవుతారని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. ఆ తేదీలేంటో చూద్దాం.
26
7, 16, 25 తేదీల్లో పుట్టినవారు
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య 7. ఈ సంఖ్యకు అధిపతి కేతువు. ఇది విరక్తి, అంతర్ముఖత్వం, ఆధ్యాత్మికత, లోతైన ఆలోచనలకు ప్రతీక. అందుకే ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న వయసులోనే సాధారణ వ్యక్తులకంటే భిన్నంగా ఆలోచిస్తారు. వీరు త్వరగా సంతోషపడరు, సంతృప్తి చెందరు. ఈ లోతైన ఆలోచనా విధానం వల్లే వీరి జీవితంలో పురోగతి నెమ్మదిగా కనిపిస్తుంది.
36
విజయం ఆలస్యమైనా..
ఈ తేదీల్లో పుట్టినవారు దొరికిన అవకాశాలతో సర్దుకుపోరు. ఒక ఉద్యోగం, స్థానం లేదా స్థాయి వీరికి సరిపోదు అనిపిస్తే, దాన్ని వదిలేసి మళ్లీ కొత్త దారి వెతుకుతారు. ఈ అన్వేషణే వారిని ఆలస్యంగా సెటిల్ అయ్యేలా చేస్తుంది. అంతేకాదు ఈ తేదీల్లో పుట్టినవారికి పేరు, డబ్బు మాత్రమే కాకుండా గౌరవం కూడా లభిస్తుంది. వీరి విజయం ఒక్కరోజులో వచ్చిన అదృష్టం కాదు కాబట్టి, సమాజంలో వీరిని చూసే చూపు భిన్నంగా ఉంటుంది. అందుకే వీరి విజయం ఆలస్యమైనా ఎక్కువకాలం నిలిచిపోతుంది.
ఈ తేదీల్లో పుట్టినవారిపై శని లేదా కేతు ప్రభావం బలంగా ఉంటుంది. శని ప్రభావం ఉన్న చోట ఆలస్యం తప్పదు, కానీ అదే శని చివరికి స్థిరత్వం, శాశ్వత విజయం కూడా ఇస్తాడు. అందుకే ఈ తేదీల్లో పుట్టినవారు 30 ఏళ్ల వయసు వరకు అనేక ఒడిదుడుకులు చూస్తారు. 32 లేదా 35 దాటిన తర్వాత ఒక్కసారిగా ఎదుగుతారు. అప్పటివరకు కూడబెట్టుకున్న అనుభవం, ఓర్పు, జ్ఞానం ఒక్కసారిగా ఫలితాలుగా మారుతాయి.
56
ఏ రంగాల్లో రాణిస్తారంటే?
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టినవారు సాధారణంగా పరిశోధన, టెక్నాలజీ, ఐటీ, వైద్య, ఆధ్యాత్మిక, రచనా రంగాల్లో లేదా స్వతంత్రంగా పనిచేసే వృత్తుల్లో గొప్పగా రాణిస్తారు. వీరికి ఆదేశాలు పాటించే పనికన్నా, స్వతంత్రంగా ఆలోచించే అవకాశం ఉన్న రంగాలే ఎక్కువగా సరిపోతాయి. ప్రారంభంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా, ఒకసారి సరైన దిశ దొరికాక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు.
66
వ్యక్తిగత జీవితంలో..
వ్యక్తిగత జీవితంలో కూడా వీరు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహాలు, సంబంధాలు, వివాహం వంటి విషయాల్లో తొందరపడరు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం దానికి కట్టుబడి ఉంటారు. ఈ లక్షణం వల్లే జీవిత భాగస్వామ్యం లేదా కుటుంబ జీవితం కాలక్రమేణా బలంగా మారుతుంది.