Birth Date: ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారు ఫిట్‌నెస్ ఫ్రీక్స్..జిమ్ లో మాత్రమే కనిపిస్తారు..!

Published : Jul 08, 2025, 05:09 PM IST

కొన్ని ముఖ్యమైన తేదీల్లో పుట్టిన వారికి వ్యాయామం పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవితానికి వీరు ఎక్కువ కట్టుబడి ఉంటారు.

PREV
15
Birth date

మన జీవితాన్ని జోతిష్యశాస్త్రం, న్యూమరాలజీ చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మన అభిరుచులు, వ్యక్తిత్వాన్ని వీటి ఆధారంగా తెలుసుకోవచ్చు. సంఖ్యా శాస్త్రం ప్రకారం, కొన్ని ముఖ్యమైన తేదీల్లో పుట్టిన వారికి వ్యాయామం పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవితానికి వీరు ఎక్కువ కట్టుబడి ఉంటారు. జిమ్ లో చాలా కష్టపడి అయినా కండలు పెంచాలి, రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి అనుకుంటూ ఉంటారు. మరి, అలాంటి తేదీలేంటో చూద్దామా...

25
నెంబర్ 1..

ఏ నెలలో అయినా 1, 19, 28 తేదీల్లో పుట్టిన వారికి పట్టుదల చాలా ఎక్కువ. వీరు ఎక్కువగా అందరితో పోటీ పడే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అంతేకాదు వీరికి ఫిట్‌నెస్, ఆరోగ్యం పై శ్రద్ధ కూడా చాలా ఎక్కువ. శరీరాన్ని చాలా దృఢంగా ఉంచుకోవడానికి కష్టపడతారు. జిమ్ లో ఎక్కువ సమయం గడిపే అవకాశం కూడా ఉంది. మంచి శరీరాకృతి పొందాలనే లక్ష్యంతో శ్రమిస్తారు. బాడీని ఎప్పుడూ ఫిట్ గా ఉంచుకుంటారు. ఈ తేదీల్లో జన్మించిన వారు చాలా క్రమశిక్షణతో ఉంటారు.

35
నెంబర్ 5...

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 5 కిందకు వస్తారు. వీరు తమ లైఫ్ స్టైల్ చాలా చురుకుగా ఉండేలా చూసుకుంటారు. సాహసాలు చేయడంలో ముందుంటారు. వీరు ఫిట్‌నెస్ విషయంలో చాలా పట్టుదలతో ఉంటారు. వ్యాయామాలు చాలా ఎక్కువగా చేస్తారు.ఫిట్నెస్ వారిలో ఉత్సాహాన్ని పెంచుతుంది.వీరు సహజంగానే బలమైన శక్తిని కలిగి ఉంటారు. రోజంతా చురుకుగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం వ్యాయామం సరైన మార్గం అని ఫీలౌతారు.

45
నెంబర్ 9..

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. వీరు సహజంగా కరుణ, సానుభూతి కలిగి ఉంటారు. వీరు ఆరోగ్యానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు ఫిట్‌నెస్ ఔత్సాహికులు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వీరు వ్యాయామాన్ని ఎంచుకుంటారు. యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం అని వీరు నమ్ముతారు.

55
పుట్టిన తేదీ 22

ఏ నెలలోనైనా 22న జన్మించిన వ్యక్తులు..

ఈ వ్యక్తులను తీవ్రమైన ఫిట్‌నెస్ అభిమానులుగా పరిగణిస్తారు. పట్టుదల, కృషి వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు ఫిట్‌నెస్ విషయంలో ఎక్కువ పట్టుదల చూపిస్తారు. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూనే ఉంటారు. ఫిట్‌నెస్ కి తమ జీవితాన్ని అంకితం చేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories