ఈ తేదీల్లో పుట్టినవారు చాలా స్మార్ట్.. ఏ పనినైనా ఇట్టే పూర్తిచేస్తారు!

Published : Nov 05, 2025, 02:58 PM IST

సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారు ప్రతీ పనిని ఈజీగా, చాకచక్యంగా పూర్తిచేస్తారు. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారిస్తారు. ఏ కొత్త విషయమైనా నేర్చుకోవడంలో ముందుంటారు. మరి ఏ తేదీల్లో జన్మించిన వారు ఈ లక్షణాలు కలిగి ఉంటారో ఇక్కడ చూద్దాం.

PREV
15
ఏ తేదీల్లో పుట్టినవారు స్మార్ట్ గా ఉంటారు?

పుట్టినతేది కేవలం సంఖ్య మాత్రమే కాదు.. అది ఆ వ్యక్తి స్వభావం, ఆలోచనా విధానం, ప్రతిభ, జీవన విధానం వంటి అనేక విషయాలను ప్రతిబింబించే అద్భుతమైన సంకేతం. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో జన్మించిన వారు తెలివిగా, చురుకుగా, సృజనాత్మకంగా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు తమ ప్రతిభను చూపించడానికి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం ఉండదు. వారి మనసులో ఉన్న ఆలోచనలు సులభంగా కార్యరూపం దాల్చుతాయి. మరి ఆ ప్రత్యేకమైన పుట్టిన తేదీలేంటో చూద్దామా..

25
ఏ నెలలో అయినా ఈ తేదీల్లో పుట్టినవారు..

సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 1, 5, 10, 14, 19, 23, 28 తేదీల్లో పుట్టినవారు చాలా స్మార్ట్ గా పనిచేస్తారట. వీరు కొత్త ఆలోచనలు, పరిస్థితులను అంచనా వేసే గుణం, సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటారు. అంతేకాదు వీరు చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఎవరినైనా తక్కువ టైంలోనే తమవైపు తిప్పుకుంటారు. వీరి మాటల్లో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది.

35
ఏ రంగాల్లో రాణిస్తారంటే?

ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు ఏ రంగంలో అయినా.. తమ సత్తాను చాటుతారు. ఉద్యోగం, వ్యాపారం, కళా రంగాల్లో వీరు ఎప్పుడూ ముందుంటారు. వీరికి కొత్త విషయాలు నేర్చుకోవడం మీద చాలా ఆసక్తి ఉంటుంది. ఒకసారి ఏదైనా విషయం పట్ల ఆసక్తి కలిగితే, దాన్ని పూర్తిగా నేర్చుకునే వరకు వదిలిపెట్టరు. ఈ లక్షణమే వీరిని ఇతరుల కంటే భిన్నంగా నిలబెడుతుంది.

45
వీరిపై నమ్మకం ఎక్కువ

ఈ తేదీల్లో పుట్టినవారు ఏ పనినైనా నిర్ణయించిన సమయానికి పూర్తి చేస్తారు. అందుకే పెద్దలు, తోటివారు వీరిని బాగా నమ్ముతారు. వీరి పనిలో నాణ్యత, వేగం రెండూ ఉంటాయి. సామాజిక సంబంధాల విషయంలో కూడా ఈ వ్యక్తులు చాలా తెలివిగా ఉంటారు. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఏం చెప్పాలో వీరికి బాగా తెలుసు. అందువల్ల వీరు అందరితో స్నేహంగా, సరదాగా ఉంటారు. గౌరవంతో మెలుగుతారు. 

55
లోపం ఏమిటంటే?

ఈ తేదీల్లో పుట్టినవారికి ఉన్న చిన్న లోపం ఏమింటంటే.. పనిలో ఎక్కువగా మునిగిపోతారు. ఏదైనా టార్గెట్ పెట్టుకుంటే, దాన్ని సాధించేవరకు విశ్రాంతి తీసుకోరు. కొన్నిసార్లు ఈ ఆత్రుత వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కానీ ధైర్యం, పట్టుదల, క్రమశిక్షణ వీరిని మళ్లీ మామాలు పరిస్థితికి తీసుకువస్తాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా వీరు వెనక్కి తగ్గరు. వాటిని సవాళ్లుగా తీసుకొని విజయం సాధిస్తారు. అంతేకాదు చుట్టూ ఉన్నవారికి కూడా ప్రోత్సాహం, ఉత్సాహం కలిగిస్తారు.  

Read more Photos on
click me!

Recommended Stories