Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారితో జాగ్రత్త… పైకి చాలా మంచివారిలా కనిపిస్తారు!

Published : Dec 12, 2025, 04:07 PM IST

సాధారణంగా మనుషులు పైకి ఎలా కనిపిస్తారో.. లోపల కూడా అలాగే ఉంటారని చెప్పలేము. ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టినవారు బయటికి చాలా మంచిగా, ప్రేమగా, అమాయకంగా కనిపిస్తారు. కానీ వారి అసలు స్వభావం వేరే ఉంటుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.

PREV
15
Birth Date Personality Secrets

సంఖ్యా శాస్త్రం ప్రకారం ప్రతి పుట్టిన తేదీ ఒక ప్రత్యేక గ్రహశక్తిని కలిగి ఉంటుంది. ఆ రోజు ఏ గ్రహం ప్రభావంలో ఉందో, ఏ నక్షత్రం శక్తి పనిచేస్తుందో అనేదాన్ని బట్టి వారి వ్యక్తిత్వం, ఆలోచనా ధోరణి, ప్రవర్తన ఉంటాయి. కొన్ని తేదీల్లో పుట్టినవారు పైకి చాలా స్నేహంగా, ప్రేమగా, మృదువుగా కనిపిస్తారు. కానీ వీరి నిజ స్వరూపం ఇతరులను ఆశ్చర్యపరుస్తుంది. మరి ఏ తేదీల్లో పుట్టినవారు ఇలాంటి స్వభావం కలిగి ఉంటారో ఇక్కడ చూద్దాం. 

25
ఏ తేదీల్లో పుట్టినవారు పైకి ప్రేమగా కనిపిస్తారు?

సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 2, 7, 11, 16, 20, 25, 29 తేదీల్లో పుట్టినవారిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు భావోద్వేగాలకు కారకుడు కావడం వల్ల ఈ తేదీల్లో పుట్టినవారికి సున్నితత్వం, ఊహాశక్తి, ప్రేమ ఉండే అవకాశం ఎక్కువ. అయితే చంద్రుని మార్పులు వీరి మనోభావాలను తరచుగా మారేలా చేస్తాయి. అందుకే వీరు బయటికి సౌమ్యంగా కనిపించినా.. లోపల మాత్రం వేరేలా ఉంటారు. 

35
చంద్రుడి ప్రభావం

చంద్రుడి ప్రభావం ఉన్నవారికి మృదుస్వభావం, సహనం, ఇతరులకు సహాయం చేయాలనే తపన బాహ్యంగా కనిపిస్తుంది. కానీ ఎవరైనా వీరికి ద్రోహం చేస్తే లేదా వీరిని తప్పుగా అర్థం చేసుకుంటే, వీరి మనసు వెంటనే చిన్నబుచ్చుకుంటుంది. అలాంటి టైంలో వీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా ఊహించలేము. కాబట్టి ఈ తేదీల్లో పుటినవారితో స్నేహం, ప్రేమ కాస్త కష్టంగా ఉంటాయి. 

45
వ్యక్తిత్వ లక్షణాలు

ఈ తేదీల్లో పుట్టినవారు బయటికి ధైర్యవంతులు, న్యాయపరులు, అందరికీ రక్షణగా నిలిచే వ్యక్తుల్లా కనిపిస్తారు. కానీ అంతర్గతంగా వీరికి అహం, ఆత్మగౌరవం, స్వతంత్ర స్వభావం ఎక్కువగా ఉంటుంది. వీరి ఆలోచనలతో ఎవరైనా ఏకీభవించకపోయినా లేదా వీరి గౌరవాన్ని ఎవరైనా దెబ్బతీసినా వీరి కోపాన్ని భరించడం చాలా కష్టం. వీరితో బంధంలో ఉన్నవారు ఓవైపు వీరి మృదుస్వభావాన్ని ఆస్వాదిస్తారు. మరోవైపు వీరి ఆలోచనల లోతు అర్థంకాక ఆశ్చర్యపోతారు.

55
అర్థం చేసుకోవడం ముఖ్యం

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో పుట్టినవారు 10% మాత్రమే బయటకు కనిపిస్తారు. మిగతా 90% వారు తమలోనే దాచిపెడతారు. అందుకే వీరితో సంబంధాలు, స్నేహాలు, భాగస్వామ్యం, ప్రేమ, కుటుంబ బంధాలు అన్నీ నెమ్మదిగా నిర్మించుకోవాలి. వారిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం అవసరం. వారి మనసు గెలిస్తే ఈ ప్రపంచంలో వారికంటే మంచి మనుషులు వేరే ఉండరు. కానీ నమ్మకం కోల్పోతే మాత్రం పూర్తిగా దూరమవుతారు. 

Read more Photos on
click me!

Recommended Stories