
2026 కొత్త సంవత్సరం ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జోతిష్యశాస్త్రం ప్రకారం, కొత్త సంవత్సరంచాలా ముఖ్యమైనది. ఎందుకంటే, ఈ సంవత్సరం ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. ఇది 12 రాశుల జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేయనుంది. ఇక.. జోతిష్యశాస్త్రంలో శనికి చాలా ప్రాముఖ్యత ఉంది. దాని కదలిక అన్ని గ్రహాలలో కెల్లా నెమ్మదిగా ఉంటుంది. ఇది శుభ, అశుభ రెండింటికీ దీర్ఘకాల ప్రభావాలకు దారితీస్తుంది. శని గ్రహం ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉండి, తర్వాత మరో రాశిలోకి వెళ్తుంది. శని ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కాలంలో శని చాలా కాలం పాటు తిరోగమనంలో , తర్వాత ప్రత్యక్షంగానూ ఉంటుంది. అంటే, అస్తమించి.. ఆ తర్వాత ఉదయిస్తాడు. కాబట్టి... ఏలినాటి శని ప్రభావం కొన్ని రాశులపై చాలా ఎక్కువగా చూపించనుంది.
2025 మార్చి లో శని మీన రాశిలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి జూన్ 2027 వరకు ఈ రాశిలోనే ఉంటుంది. శని ఒక రాశిలో ఎక్కువ కాలం ఉన్నప్పుడు, దాని ప్రభావం స్థిరత్వంగా కొనసాగుతుంది. దీని కారణంగా ఏలినాటి శని ప్రభావం మీన రాశిపై ఈ ఏడాది మొత్తం ఉంటుంది. ఈ ఏడాది ఎటువంటి కొత్త మార్పులు ఉండవు. అంటే... పెరిగిన బాధ్యతలు, మానసిక ఒత్తిడి, సవాళ్లు వస్తూనే ఉంటాయి.
మేష రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం ఈ మధ్యే మొదలైంది. ఈ ప్రభావం కారణంగా మేష రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కోపం కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి, ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంయమనం పాటించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మంచి ఆలోచనతో ముందుకు వెళితే... సమస్యలు తగ్గే అవకాశం ఉంది.
మీన రాశి వారు ఈ ఏడాది మార్చి నుంచి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కాబట్టి.. ఈ కొత్త ఏడాది కూడా వీరికి సవాళ్లతోనే సాగుతుంది. వీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారొచ్చు. ఆదాయం వచ్చినా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సహనంగా ఉండటం నేర్చుకోవాలి. ఓపికగా ఉంటే కోరుకున్నవి దక్కే అవకాశం ఉంటుంది.
కుంభ రాశివారు ఏలినాటి శని దశ చివరి దశలో ఉన్నారు. ఈ సమయంలో వీరు ఇప్పటి వరకు పడిన కష్టాలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. మీరు కష్టపడి పని చేయడం వల్ల ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. కానీ, మానసిక ఒత్తిడి, కొన్ని అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. రోజువారీ పనులలో ఓర్పుగా, బ్యాలెన్స్డ్ గా ఉండటం చాలా అవసరం.
సింహరాశి వారు 2026లో శని ప్రభావంలో ఉంటారు. 2027లో శని రాశి మార్పు తర్వాత ఈ ప్రభావం ముగుస్తుంది. ఈ కాలంలో, అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు, ప్రయాణాల అవసరం ఉండవచ్చు. మానసిక, శారీరక అలసట ఉండవచ్చు. మీ ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండటం , మీ ప్రవర్తనలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి
2026 ధనుస్సు రాశి వారికి అదృష్టానికి రెండవ సంవత్సరాన్ని సూచిస్తుంది. సవాళ్లు ఎదురౌతాయి. శని సంచారం కుటుంబం, ఇల్లు, ఆస్తి లేదా స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో ఆలస్యం లేదా అడ్డంకులను కలిగించవచ్చు. అయితే, ఈ సమయం సహనం, అనుభవం , పరిపక్వతకు పరీక్ష మాత్రమే. ప్రశాంతంగా ఉంటే ఎలాంటి సమస్యను అయినా పరిష్కరించగలరు.
శని కారణంగా చెడు ప్రభావాలు తగ్గాలంటే ఇవి చేస్తే చాలు...
ఉదయాన్నే రావి చెట్టుకు నీరు అర్పించి, ఆవ నూనె దీపం వెలిగించి, దాని చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఈ పరిహారం శని కఠినమైన ప్రభావాలను తగ్గిస్తుంది. క్రమంగా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది.
శనివారం నల్ల నువ్వులు, నల్ల గొడుగులు, బూట్లు లేదా ఆవ నూనెను దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ దానం శని వల్ల కలిగే అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది.
శని చాలీసా, హనుమాన్ చాలీసాను ప్రతిరోజూ లేదా శనివారం జపించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ప్రతికూలత తొలగిపోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.