Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం సడెన్ గా తలుపు తడుతుంది..!

Published : May 02, 2025, 01:38 PM IST

కొన్ని ముఖ్యమైన తేదీల్లో పుట్టిన వారు అప్పటి వరకు ఎన్ని కష్టాలు ఎదురించినా, సడెన్ గా అదృష్టం తలుపుతడుతుంది.అంటే.. సడెన్ గా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. 

PREV
15
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం సడెన్ గా తలుపు తడుతుంది..!

జోతిష్యం ఆధారంగా మనం పుట్టిన సమయాన్ని బట్టి.. మన జీవితం , భవిష్యత్తు  గురించి  ఎలా తెలుసుకోవచ్చో, న్యూమరాలజీ ప్రకారం కూడా అదేవిధంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మనం పుట్టిన తేదీని బట్టి ఈ విషయాలు తెలుసుకుంటారు.ఈ న్యూమరాలజీ ప్రకారం కొన్ని ముఖ్యమైన తేదీల్లో పుట్టిన వారు అప్పటి వరకు ఎన్ని కష్టాలు ఎదురించినా, సడెన్ గా అదృష్టం తలుపుతడుతుంది.అంటే.. సడెన్ గా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. మరి, ఆ తేదీలేంటో చూద్దామా..
 

25


న్యూమరాలజీ ప్రకారం, ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వ్యక్తులు నెంబర్ 4 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారికి చిన్నతనం నుంచి కష్టాలు ఎక్కువగా రావచ్చు. కానీ, ఆ కష్టాలను చూసి వారు ఎప్పుడూ భయపడరు. వాటిని ఎదుర్కొవడానికే ప్రయత్నిస్తారు. ఎలాంటి సవాళ్లు ఎదురయ్యేనా భయపడటం, కృంగిపోవడం లాంటివి చేయరు.ధైర్యంగా నిలపడతారు. అందుకే, వీరి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కానీ, సడెన్ గా సక్సెస్ వస్తుంది. చాలా కష్టాలు అనుభవించిన తర్వాత విజయం వారిని వరిస్తుంది. అనుకోకుండా కోటీశ్వరులు అవుతారు.
 

35

నాయకత్వం
 ఈ నెంబర్ 4 లో పుట్టిన వారికి  రాహువు ఒక నీడలా ఉంటుంది. రాహు ప్రభావం ఉన్నవారి జీవితం అనూహ్య మలుపులతో నిండివుంటుంది. ఇది భావోద్వేగాలూ, అదృష్టాన్నీ ఒక రోలర్‌కోస్టర్ ప్రయాణంలా చేస్తుంది. కాని అదే సమయంలో, అత్యంత అరుదైన అవకాశాల కోసం వీరిని ముందుగా సిద్ధం చేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండేందుకు హెచ్చరిస్తూ, వీరి జీవితంలో మార్గదర్శిగా మారుతుంది.

అపారమైన కష్టపడే శక్తి
నెంబర్ 4 లో పుట్టిన వారిలో అసాధారణమైన పని నైపుణ్యం ఉంటుంది. వారు తమ లక్ష్యాల కోసం అంకితభావంతో పని చేస్తారు. విజయం అనేది కేవలం కలలపై కాదు, వాటిని సాకారం చేయాలనే దృఢ సంకల్పంపై ఆధారపడుతుందనే విషయాన్ని వారు నమ్ముతారు. వారి ప్రతి కృషి తమ విజయాల భవనానికి ఒక బలమైన ఇటుకగా మారుతుంది.
 

45
Numerology in Name

నైపుణ్యం 

ఈ సంఖ్యకి చెందినవారు తమ పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉన్న రంగాలలో రాణిస్తారు. వారు క్రమశిక్షణతో జీవన మార్గాన్ని నడిపిస్తారు. ఎప్పుడెప్పుడు ముందుకు సాగాలో, ఎప్పుడు వెనక్కి తగ్గాలో స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. నిర్ణయాలు తీసుకునే ధైర్యం, సమయపాలన, ప్రదర్శించే స్థిరత్వం వీరిని ఇతరుల కంటే ముందుండేలా చేస్తాయి.

ఆవిష్కరణలు 
సంఖ్య 4వ వారు కొత్త ఆలోచనలు, మార్గాల పట్ల ఆసక్తి చూపుతారు. మార్పును స్వీకరించడంలో వీరు వెనుకాడరు. వీరి సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణల పట్ల ప్రేమ వీరిని సాధారణ ప్రజల కంటే భిన్నంగా ఉంచుతుంది.

55

క్రమశిక్షణే సంపదకు మూలం
వారి దృష్టిలో అదృష్టం అనేది యాదృచ్ఛికం కాదు, అది క్రమశిక్షణ, పట్టుదల వలన సిద్ధించే ఫలితం. తాము ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తారు. వారి కృషి పట్ల గౌరవం, నిబద్ధత వారికి సంపదను , స్థిరతను అందిస్తుంది.

అదృష్ట రంగులు, రోజుల ప్రభావం
ఈ తేదీల్లో పుట్టిన వారికి లేత రంగులు అదృష్టాన్నితీసుకువస్తాయి.ముఖ్యంగా గులాబీ రంగు వారిలో సాంత్వనను కలిగిస్తుంది. ఆదివారం వారు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే రోజు కాగా, శనివారం వారి క్రమశిక్షణను మెరుగుపరచే రోజు.

Read more Photos on
click me!

Recommended Stories