Birth Date: 30 ఏళ్లు దాటనిది వీళ్లు లైఫ్ లో సక్సెస్ అవ్వలేరు..!

Published : Jul 03, 2025, 01:39 PM IST

న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారికి జీవితంలో సక్సెస్ చాలా ఆలస్యం గా వస్తుంది.

PREV
15
birth date

జీవితంలో విజయం సాధించాలనే తపన, కోరిక అందరిలోనూ ఉంటుంది. దానికోసమే లైఫ్ లో ఎక్కువగా కష్టపడేవారు కూడా ఉంటారు. కొందరికి లైఫ్ లో సక్సెస్... చాలా చిన్న వయసులోనే వచ్చేస్తూ ఉంటుంది. మరికొందరికి ఇది చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎంతో కష్టపడితే తప్ప.. వారు సక్సెస్ కాలేరు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారికి జీవితంలో సక్సెస్ చాలా ఆలస్యం గా వస్తుంది. యంగ్ ఏజ్ లో ఎంత శ్రమించినా కాస్త గుర్తింపు కూడా రాదు. కానీ ఒక వయసుకు వచ్చిన తర్వాత మాత్రం చాలా ఈజీగా వారి జీవితంలోకి విజయం అడుగుపెడుతుంది. మరి, ఆ తేదీలేంటో చూద్దాం...

25
7వ తేదీ..

ఏ నెలలో అయినా నెంబర్ 7వ తేదీలో జన్మించిన వారి జీవితంలో విజయం చాలా ఆలస్యంగా వస్తుంది. వీరు ఏ పని చేయాల్సి వచ్చినా తమను తాము ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఏ విషయంలో అయినా క్లారిటీ వచ్చేదాక ఎలాంటి పనీ చేయరు. పని చేయడానికి ముందు ట్రయల్ అండర్ ఎర్రర్ విధానాన్ని అనుసరిస్తారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. ఆలోచించి ఆచి, తూచి అడుగులు వేస్తారు. దీని వల్లే వీరు జీవితంలో విజయం సాధించడానికి ఆలస్యం అవుతుంది. కనీసం వారి వయసు 30 ఏళ్లు దాటకుండా వీరి జీవితంలో సక్సెస్ రాదు. 30 దాటిన తర్వాతే మొదలౌతుంది. తమ లక్ష్యాన్ని అర్థం చేసుకోవడానికి, దానిని సాధించడానికి వారికి అంత సమయం పడుతుంది.

35
14వ తేదీ...

ఏ నెలలో అయినా 14 వతేదీలో జన్మించినవారి ఆలోచనలు వినూత్నంగా ఉంటాయి. ఈ తేదీలో పుట్టిన వారు తమను తాము రుజువు చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది.మొదట్లో వీరు లైఫ్ ని పెద్దగా సీరియస్ తీసుకోరు. కాస్త వయసు వచ్చిన తర్వాత లైఫ్ లో ఏం చేయాలి? ఏం సాధించాలి అనే దానిపై ఒక క్లారిటీ వస్తుంది.

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి, సృజనాత్మకతను ప్రదర్శించగల వేదికను సృష్టించుకుంటారు. తరువాతి దశల్లో కెరీర్ పరంగా వారేంటో ప్రపంచానికి చూపిస్తారు.

45
25వ తేదీ...

ఏ నెలలో అయినా 25వ తేదీలో జన్మించినవారు కూడా లైఫ్ లో సక్సెస్ ని చాలా ఆలస్యంగా రుచి చూస్తారు.25వ తేదీ వారికి ఒక సహజమైన జ్ఞానం ఉంటుంది. వీరు తమ ఆధ్యాత్మికతను, కళను, నైపుణ్యాన్ని సమన్వయం చేయగలుగుతారు. వారిలో మౌనంగా ఎదిగే శక్తి ఉంటుంది. ఒక స్థిరమైన మార్గాన్ని అనుసరిస్తూ, వారేంటో తామే నిరూపించుకుంటారు. సాధారణ కెరీర్ పథకం కాకుండా, వీరు తమ అభిరుచుల్ని విలువైన ప్రయోజనాలుగా మార్చుకుంటారు.

55
30వ తేదీ:

30వ తేదీన పుట్టినవారు అత్యంత సృజనాత్మకులు.కానీ యువవయసులో వారిలో ఆత్మగౌరవం నిర్మాణానికి కొంత సమయం పడుతుంది. సంబంధాల పరంగా ఎదురయ్యే అనుభవాలు వారిని మరింత పటిష్టంగా మార్చుతాయి. వారికి అసలైన విజయాన్ని తెచ్చిపెట్టేది తమ విలువలే అనే విషయం వీరు చాలా ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. ఒక్కసారి అర్థం అయిన తర్వాత.. వారు జీవితంలో విజయం సాధించడం పై దృష్టి పెడతారు. అనుకున్న విజయాన్ని కోరుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories