Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు చాలా స్పెషల్.. వీరితో ఉంటే జీవితాంతం పండగే!

Published : Mar 05, 2026, 04:22 PM IST

జ్యోతిష్య శాస్త్రంలో జన్మ నక్షత్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఒక వ్యక్తి పుట్టిన నక్షత్రం అతని ఆలోచనలు, ఇతరులతో వ్యవహరించే విధానంపై ప్రభావం చూపుతుంది. కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారు ప్రత్యేక లక్షణాల వల్ల ఇతరుల జీవితాల్లో సంతోషం నింపుతారు. 

PREV
16
Birth Stars Astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాల స్థితి.. వ్యక్తుల స్వభావం, జీవన విధానంపై ప్రభావం చూపుతుంది. కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారు సహజంగా ప్రేమాభిమానాలు ఎక్కువగా చూపిస్తారు, కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు. అలాంటి వారితో జీవితం నిజంగా పండగలా ఉంటుంది. మరి ఏ నక్షత్రాల్లో పుట్టినవారు తమ ప్రత్యేక లక్షణాల వల్ల కుటుంబం, స్నేహితులు, భాగస్వాములకు ఆనందాన్ని పంచుతారో ఇక్కడ చూద్దాం.

26
రోహిణి నక్షత్రం

రోహిణి నక్షత్రంలో పుట్టినవారు సహజంగా మృదు స్వభావం కలిగి ఉంటారు. వీరు ప్రేమాభిమానాలను వ్యక్తపరచడంలో వెనుకాడరు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, జీవిత భాగస్వామి పట్ల వీరు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. వీరి మాటల్లో, ప్రవర్తనలో సానుకూలత ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీరితో ఉండేవారికి ఎప్పుడూ ఆత్మీయత, ఆనందం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

36
మృగశిర నక్షత్రం

మృగశిర నక్షత్రంలో పుట్టినవారు చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు సహజంగా చురుకుగా ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి, జీవితాన్ని ఆస్వాదించాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరితో సమయం గడిపే వారికి విసుగు అనిపించదు. వీరు అందరితో ఈజీగా కలిసిపోతారు.

46
పునర్వసు నక్షత్రం

పునర్వసు నక్షత్రంలో పుట్టినవారికి మంచితనం ఎక్కువ. వీరు చాలా సహనంతో ఉంటారు. ఇతరులకు సహాయం చేయాలనే భావన వీరిలో బలంగా ఉంటుంది. కుటుంబం, స్నేహితుల కోసం ఎంత కష్టపడ్డానికి అయినా వీరు సిద్ధంగా ఉంటారు. అందుకే వీరు అందరి నమ్మకం పొందగలుగుతారు.

56
అనూరాధ నక్షత్రం

అనూరాధ నక్షత్రంలో పుట్టినవారు సంబంధాలకు చాలా విలువ ఇస్తారు. వీరు ఒక్కసారి ఎవరికైనా దగ్గరైతే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరి నిజాయతీ, నమ్మకం కారణంగా వీరితో ఉన్న సంబంధాలు చాలా బలంగా ఉంటాయి.

66
రేవతి నక్షత్రం

రేవతి నక్షత్రంలో పుట్టినవారు చాలా దయా హృదయం కలిగి ఉంటారు. వీరు ఇతరుల భావాలను ఈజీగా అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. సున్నితమైన మనసు, మంచి ఆలోచనలు వీరిని ప్రత్యేకంగా చూపిస్తాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఎప్పుడూ మద్ధతుగా నిలబడే స్వభావం వీరిలో ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories