Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు..!

Published : Mar 05, 2026, 12:21 PM IST

 Birth Date: న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు.తెలియక చేసే తప్పుల కారణంగా అదృష్టం చేజారుతుంది. 

PREV
12
Numerology

న్యూమరాలజీ ప్రకారం 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై గురు గ్రహ ప్రభావం ఉంటుంది. సంఖ్యా శాస్త్రంలో గురువును శుభం, అదృష్టాన్ని ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు.

22
ఈ తేదీల్లో పుట్టిన వారిలో కొన్ని స్పెషల్ లక్షణాలు ఉంటాయి..

దైవిక శక్తి.. ఈ తేదీల్లో పుట్టిన వారికి సహజంగానే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వీరి చేతులను అమృత హస్తం లేదా బంగారు హస్తం అని చెప్పొచ్చు. అంటే, వీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతమౌతుంది.

ఎనర్జీ ట్రాన్స్ ఫర్...ఈ తేదీల్లో పుట్టిన వారు తొందరగా ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు శరీరంలోని శక్తి ఒకరి నుంచి మరొకరికి ప్రవహిస్తుంది. దీని వల్ల మీ అదృష్టం లేదా పాజిటివ్ వైబ్రేషన్స్ ఎదుటివారికి బదిలీ అవ్వడం వల్ల మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని న్యూమరాలజీ చెబుతుంది. అందుకే, ఈ తేదీల్లో పుట్టిన వారు ఎదుటివారికి షేక్ హ్యాండ్ ఇచ్చే బదులు.. నమస్కారం చేయడం ఉత్తమం. మన శక్తిని మనం కాపాడుకుంటూ ఎదుటివారికి గౌరవం ఇచ్చినట్లు అవుతుంది.దీని వల్ల మీ అదృష్టం ఇతరులకు వెళ్లదు. మీతోనే ఉంటుంది.

ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వస్తే.. మనసులో ఓం లేదా మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోవడం వల్ల ఒక రకమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇక.. ఈ తేదీల్లో పుట్టిన వారు.. పసుపు రంగు రుమూలును జేబులో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా మీ ఎనర్జీ క్షీణించదు. మీ అదృష్టం రెట్టింపు అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories