Birth Date: ఈ తేదీలలో పుట్టిన వ్యక్తిని పెళ్లి చేసుకునే ముందు 100 సార్లు ఆలోచించండి, వీరితో చాలా కష్టం

Published : Mar 05, 2026, 03:00 PM ISTUpdated : Mar 05, 2026, 04:10 PM IST

Birth Date: సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన వారితో వివాహం బంధం చాలా కష్టంగా గడుస్తుంది. ఏ తేదీలలో పుట్టిన వారు వివాహ బంధంలో సరిగా ఇమడలేరో ఇక్కడ చెప్పాము. న్యూమరాలజీ ప్రకారం ఆ తేదీలు ఏవో తెలుసుకోండి. 

PREV
14
వీరితో పెళ్లి కష్టం

న్యూమరాలజీ లేదా సంఖ్యాశాస్త్రం ప్రకారం వివాహానికి, సంతోషకరమైన వైవాహిక జీవితానికి, భార్యాభర్తల మధ్య అనుకూలతకు.. వారి పుట్టిన తేదీలు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా, జీవితం సుఖంగా సాగాలన్నా.. పుట్టిన తేదీ లేదా వారి మూల సంఖ్య కలయిక కూడా ఎంతో అవసరం. కొన్ని తేదీలలో జన్మించిన వారితో వివాహ బంధం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వారిని వివాహం చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని న్యూమరాలజీ చెబుతోంది.

24
రాడిక్స్ సంఖ్య 4

ఏ నెలలోనైనా 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారి మూల సంఖ్య 4 అవుతుంది. 4 అంకెకు అధిపతి రాహువు. కాబట్టి వీరిపై రాహు ప్రభావం ఎక్కువ. ఈ వ్యక్తుల జీవితంలో లేదా మానసిక స్థితిలో అనేక మార్పులు ఆకస్మికంగా కలుగుతాయి. వీరు స్థిరంగా ఒక పని చేయలేరు. దీనివల్ల వారిని చేసుకున్న భాగస్వామి ఇబ్బంది పడుతుంది. వీరితో జీవితాంతం సంబంధం కొనసాగించడం కష్టంగా మారుతుంది.

34
రాడిక్స్ సంఖ్య 7

ఏ నెలలోనైనా 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారికి 7 మూల సంఖ్య అవుతుంది. ఏడు సంఖ్యకు అధిపతి కేతువు. కాబట్టి ఈ వ్యక్తులు ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. భావోద్వేగాలకు కూడా ఎక్కువగా లోనవుతారు. ఆధ్యాత్మికంగా బతికేందుకు ఇష్టం చూపిస్తారు. వీరికి వివాహం పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది. పెద్దల బలవంతం మీద పెళ్లి చేసుకున్నా.. పెళ్లి పట్ల ఎప్పుడూ ఒకసారి ఆసక్తి కోల్పోవచ్చు. ఒంటరిగా జీవించాలని వీరికి ఉంటుంది. కాబట్టి జీవిత భాగస్వామిని దూరం చేసుకుంటారు.

44
రాడిక్స్ సంఖ్య 9

ఏ నెలలోనైనా 9, 18, 27వ తేదీలలో జన్మించిన వారి మూల సంఖ్య 9 అవుతుంది. 9ని పాలించేది కుజుడు. కాబట్టి ఈ వ్యక్తులు చాలా కోపంగా ఉంటారు. దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల వీరితో వివాహ బంధం ఎంతో కష్టంగా మారిపోతుంది. వస్తువులను పగలగొట్టడం, భాగస్వామిపై శారీరకంగా దాడి చేయడం వంటి లక్షణాలు వీరికి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ తేదీలలో జన్మించిన వారితో జీవితం కష్టంగానే ఉంటుంది.

1 రాడిక్స్ సంఖ్య కలవారు 6 మూల సంఖ్య కలిగిన వారిని పెళ్లి చేసుకోకూడదు. 2 మూల సంఖ్య కలిగిన వారు 9 మూల సంఖ్య కలిగిన వారిని వివాహమాడకూడదు. అలాగే అలాగే 3 - 4, 5 - 2, 7 - 8, 9 - 1 రాడిక్స్ సంఖ్యలకు ఏమాత్ర సరిపడదు.

Read more Photos on
click me!

Recommended Stories