ఈ 5 నెలల్లో పుట్టినవారు సూపర్ ఫాస్ట్.. అన్నింట్లో ముందుంటారు!

Published : Nov 18, 2025, 12:30 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన నెల మనుషుల వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, జీవనశైలి వంటి వాటిని ప్రభావితం చేస్తుంది. కొన్ని నెలల్లో పుట్టినవారు చాలా ఫాస్ట్ గా ఉంటారు. చురుకుదనం, త్వరగా ఎదగాలనే కోరిక, వేగంగా నిర్ణయం తీసుకునే శక్తిని కలిగి ఉంటారు.

PREV
16
ఈ నెలల్లో పుట్టినవారు సూపర్ ఫాస్ట్..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నెలల్లో పుట్టినవారు చాలా చురుకుగా ఉంటారు. అన్నింట్లో ముందుంటారు. వీరి వేగాన్ని అందుకోవడం చాలా కష్టం. ఈ స్వభావమే వారిని అందరిలో ప్రత్యేకంగా చూపిస్తుంది. జీవితంలో త్వరగా ఎదగడానికి సహాయపడుతుంది. మరి ఏ నెలల్లో పుట్టినవారు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం. 

26
మార్చిలో జన్మించినవారు

మార్చి నెలలో పుట్టినవారు సృజనాత్మకతలో, ఊహాశక్తిలో, కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో ముందుంటారు. వీరు నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యంగా వ్యవహరిస్తారు. ఏ పని మొదలు పెట్టినా దానికి ఒక ప్రత్యేక శైలి జతచేస్తారు. అందుకే వీరు ఎంచుకున్న రంగాల్లో వేగంగా ఎదుగుతారు.

36
ఏప్రిల్ లో పుట్టినవారు..

ఏప్రిల్‌ నెలలో పుట్టిన వారికి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, పట్టుదల ఎక్కువ. వీరికి ఉన్న దృఢ సంకల్పం ఇతరులకంటే ప్రత్యేకం. ఒకసారి ఏదైనా నిర్ణయించుకుంటే చివరి వరకూ పోరాడతారు. పోటీ పరిస్థితుల్లో వీరి వేగం, ఆత్మవిశ్వాసం వారిని ముందుకు తీసుకెళ్తుంది.

46
మేలో జన్మించినవారు

మే నెలలో పుట్టినవారు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉంటారు. వీరు మాట్లాడే తీరు, ఆలోచించే తీరు ఒక ప్రత్యేకమైన ఆకర్షణను కలిగిస్తాయి. మల్టీటాస్కింగ్‌లో వీరు దిట్ట. అందుకే విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏ రంగమైనా వీరు వేగంగా, మెరుగ్గా రాణిస్తారు.

56
ఆగస్టు

ఆగస్టు నెలలో పుట్టిన వారు సహజ నాయకులు. వీరిలో ఉండే ధైర్యం, బాధ్యత తీసుకునే గుణం, త్వరగా నిర్ణయం తీసుకునే శక్తి వీరిని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. ఎంత రిస్క్ అయినా సరే వీరు వెనకడుగు వేయరు. వీరి శక్తి, సానుకూలత, పోరాట పటిమ వారిని జీవితంలో ఉన్నతస్థానంలో నిలబెడతాయి.

66
నవంబర్

నవంబర్‌లో పుట్టినవారు అంతర్‌దృష్టితో పాటు లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు. వీరు చేసే పనుల్లో స్పష్టత, పక్కా ప్లానింగ్ కనిపిస్తుంది. భావోద్వేగపరంగా బలంగా ఉండడం వల్ల వీరు ఏ పరిస్థితిలోనైనా ప్రశాంతంగా వ్యవహరిస్తారు. వీరి ఫోకస్, వేగం, ఐడియాలజీ అందరిలో ప్రత్యేకంగా చూపిస్తాయి.

ఈ ఐదు నెలల్లో పుట్టినవారు ఏ పని చేసినా వీరి శైలి స్పష్టంగా కనిపిస్తుంది. వీరిలో ఉన్న నైపుణ్యం, చురుకుదనం, ముందడుగు వేయాలనే తపన వీరిని సహజంగానే ముందుకు నడిపిస్తాయి. చిన్నతనం నుంచే వీరి ప్రవర్తనలో ఈ వేగం స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దవారయ్యే కొద్దీ అది మరింత మెరుగవుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories