Venus Sun Conjunction: శుక్రాదిత్య రాజయోగంతో 2026లో ఈ రాశులకు గోల్డెన్ టైమ్

Published : Nov 18, 2025, 07:56 AM IST

Venus Sun Conjunction: జ్యోతిషశాస్త్రంలో శుక్రాదిత్య రాజయోగం ఎంతో ముఖ్యమైనది. ఇది సూర్యుడు, శుక్రుడి ఒకే రాశిలో లేదా నక్షత్రంలో కలవడం వల్ల ఏర్పడుతుంది. 2026లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీనివల్ల 3 రాశుల వారికి విపరీతమైన శుభాలు కలుగుతాయి.

PREV
15
శుక్రాదిత్య రాజయోగం ఎలా ఏర్పడుతుంది?

గ్రహాల సంచారం ప్రకారం 2026 ప్రారంభంలోనే శుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. గ్రహాలు అనుకూల స్థానాల్లో ఉండడం వల్ల శుభయోగాలు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. ఇది కొన్ని రాశుల వారి వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తుంది. సూర్యుడు, శుక్రుడి కలయిక వల్ల శుక్రాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది.

25
బోలెడంత అదృష్టం

సూర్యుడు శక్తి, నాయకత్వం, విజయానికి ప్రతీకగా చెప్పుకుంటారు. ఇక శుక్రుడిని సంపద, శ్రేయస్సు, ఆనందం, అందాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పుకుంటారు. ఈ రెండు గ్రహాల కలయికతో ఏర్పడే శుక్రాదిత్య రాజయోగం 3 రాశులకు కొత్త అవకాశాలు, ఆర్థిక విజయాలను అందిస్తుంది.

35
మేష రాశి

2026 సంవత్సరం మేషరాశి వారికి బాగా కలిసివస్తుంది. వీరికి కొత్త అవకాశాలు, విజయాలు దక్కుతాయి.  ఈ సమయంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది వారి ఉద్యోగపరమైన పేరును పెంచుతుంది. శుక్రాదిత్య రాజయోగం ప్రభావంతో ఆర్థిక రంగంలో మంచి లాభాలు వస్తాయి. పెట్టుబడులు నుంచి లాభాలు రావచ్చు.  స్టాక్ మార్కెట్ నుంచి కూడా ఆర్ధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. 

45
ధనుస్సు రాశి

2026 సంవత్సరం ధనుస్సు రాశి వారికి అన్ని విధాలుగా కలిసివస్తుంది. వీరికి  విద్య, ప్రయాణం, విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోరుకున్న విజయాన్ని తెస్తాయి. స్టాక్ మార్కెట్ ఆర్థిక లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్లాన్ చేసి పెట్టుబడి పెట్టడం మంచిది. 

55
మీన రాశి

మీనరాశి వారికి 2026 సంవత్సరం అన్ని రకాలుగా మేలే చేస్తుంది. వీరికి వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో కలిసి వస్తుంది. వీరి కుటుంబంలో ఆనందం, శాంతి వంటివి పెరుగుతాయి. ఆర్థిక అవకాశాలు లాభాలను తెచ్చిపెడతాయి. షేర్లు, లాటరీలలో కూడా లాభాలు రావచ్చు. అనవసరమైన అప్పులు చేయకండి. పెట్టుబడులు కూడా ఆచి తూచి పెట్టండి. 

Read more Photos on
click me!

Recommended Stories