పుట్టిన నెల, తేదీ, గ్రహస్థితి వంటి అంశాలు మన జీవితంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఒక వ్యక్తి చదువు, ఉద్యోగం, ఆర్థిక స్థితి మాత్రమే కాదు, విదేశాల్లో స్థిరపడే అవకాశాలు కూడా కొన్ని గ్రహయోగాల ఆధారంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. అందుకే కొందరు వ్యక్తులు చిన్నప్పటి నుంచే విదేశాలకు వెళ్లాలని కలలు కనడం, తర్వాత నిజంగానే ఆ అవకాశాలు రావడం సాధారణంగా కనిపిస్తుందని వివరిస్తున్నారు. మరి ఏ నెలల్లో పుట్టినవారికి విదేశీ యోగం బలంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.