Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు IAS, IPS వంటి పెద్ద ప్రభుత్వోద్యోగాలు సాధించే అవకాశం ఎక్కువ

Published : Mar 10, 2026, 09:51 AM IST

Birth Date: న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి మూల సంఖ్య అతడి కెరీర్ గురించి చెబుతుంది. నెలలో కొన్ని తేదీల్లో పుడితే భవిష్యత్తులో పెద్ద  ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటందుని సంఖ్యా శాస్త్రం వివరిస్తోంది. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉద్యోగాలు సాధిస్తారట.

PREV
15
పుట్టిన తేదీ ఎంతో ముఖ్యం

సంఖ్యాశాస్త్రం చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతడి భవిష్యత్తును చెబుతుంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి అతడి మూల సంఖ్య లేదా రాడిక్స్ సంఖ్యను నిర్ణయిస్తుంది. ఆ సంఖ్యను బట్టి ఆ వ్యక్తి జీవితాన్ని అంచనా వేయచ్చు. కెరీర్ గురించి కూడా మూల సంఖ్య ఎన్నో విషయాలు చెబుతుంది. ముఖ్యంగా రాడిక్స్ నంబర్ 1 ఉన్నవాళ్లు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అందుకే వీళ్లు ఎక్కువగా రాజకీయాలు, ఉన్నత పదువు, పెద్ద ప్రభుత్వోద్యోగాల్లో సెటిల్ అవుతారు. 

25
ఈ తేదీలలో పుట్టిన వారు

న్యూమరాలజీ చెబుతున్న ప్రకారం ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారి మూల సంఖ్య 1 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. సూర్యుడి వల్ల ఆ వ్యక్తికి శక్తి, ఆత్మవిశ్వాసం, నాయకత్వం వంటి లక్షణాలు సహజంగానే వస్తాయి. అందుకే రాడిక్స్ నంబర్ 1 ఉన్నవారిలో నాయకత్వ లక్షణాలు, ఇతరులను ముందుండి నడిపించే సామర్థ్యం అధికంగా ఉంటాయి.

35
పుట్టుకతోనే నాయకులు

మూల సంఖ్య 1 ఉన్నవాళ్లు గుంపులో గోవిందంలా ఉండేందుకు ఇష్టపడతారు. వీరు ప్రత్యేకంగా ఉండేందుకు ఇష్టపడతారు.  ఇతరులను అనుసరించడం ఇష్టపడరు. తమ సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వీరు బలమైన ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరు కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటాయి. అందుకే వీరికి అడ్మినిస్ట్రేటివ్ పదవులు సరిగ్గా నప్పుతాయి. 

45
సివిల్స్ సాధించే అవకాశం

సంఖ్యాశాస్త్రం చెబుతున్న ప్రకారం రాడిక్స్ నంబర్ 1 ఉన్నవారికి క్రమశిక్షణ ఎక్కువ. అలాగే వారు లక్ష్యం పెట్టుకుంటే దాని కోసం అంకితభావంతో పనిచేస్తారు. ఒక్కసారి టార్గెట్ పెట్టుకున్నారంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు. ఈ లక్షణాల వల్ల సివిల్స్ వంటి కఠినమైన పోటీ పరీక్షలకు వీరు సిద్ధమవుతారు. అందులో విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువ. IAS, IPS వంటి పెద్ద ఉద్యోగాలు సాధించే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది.

55
ఏదో ఒక ప్రభుత్వోద్యోగం

కేవలం సివిల్స్ మాత్రమే కాదు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశాలు కూడ వీరికి ఉన్నాయి. ప్రభుత్వ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఓపిక, క్రమశిక్షణ, బలమైన సంకల్పం అవసరం.  రాడిక్స్ నంబర్ 1 ఉన్నవారిలో పైన చెప్పిన 3 లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీళ్లు ఎక్కువ కాలం ప్రిపేర్ అవ్వగలరు, కష్టమైన పరిస్థితుల్లోనూ నిలబడగలరు. అలాగని పుట్టిన తేదీతోనే విజయం వస్తుందని చెప్పలేం. దాని కోసం కష్టపడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories