Panchanga Rajayogam : 2026లో ఈ 4 రాశులవారికి రాజయోగమే.. అన్నీ జాక్‌పాట్సే, పట్టిందల్లా బంగారమే

Published : Dec 07, 2025, 01:19 PM IST

Panchanga Rajayogam 2026: కొత్త సంవత్సరం ప్రారంభంలో శక్తివంతమైన పంచాంగ రాజయోగం ఏర్పడబోతోంది. దీనివల్ల ప్రయోజనం పొందే రాశుల గురించి ఈ పోస్ట్‌లో వివరంగా చూద్దాం. 

PREV
15
కొత్త సంవత్సరంలో వీరి జీవితం చేంజ్...

Panchanga Rajayogam :త్వరలోనే 2025 సంవత్సరం ముగియనుంది... 2026 లో అడుగుపెట్టబోతున్నాం. కొత్త సంవత్సరం ప్రారంభంలో గ్రహాల స్థానాల్లో మార్పులు రానున్నాయి. జనవరి 4, 2026 న సూర్యుడు, శని 72° కోణంలో కలవనున్నాయి. జ్యోతిషశాస్త్రంలో ఇది పంచాంగ యోగాన్ని సృష్టిస్తుంది. ఈ అరుదైన యోగం వల్ల కొన్ని రాశుల వారిని అదృష్టం వరిస్తుంది… రాజయోగాన్ని పొందుతారు.  

25
మేషం

శని, సూర్యుడు ఏర్పరిచే పంచాంగ యోగం మేషరాశి వారికి మేలు చేస్తుంది. కాబట్టి కొత్త సంవత్సరంలో ఈ రాశివారికి అన్ని ప్రయత్నాలలో విజయం లభిస్తుంది. ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. వ్యాపారం చేసేవారికి, కొత్తగా ప్రారంభించేవారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది.

35
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి పంచాంగ యోగం వల్ల ధన ప్రవాహం సజావుగా ఉంటుంది. స్థిరమైన సంపద లభిస్తుంది. పెట్టుబడుల గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ పరిచయాల ద్వారా లాభం ఉంటుంది. వృత్తి, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి.

45
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి పంచాంగ యోగం భావోద్వేగ సమతుల్యతను ఇస్తుంది. కుటుంబంలో సమస్యలు పరిష్కారమై సత్సంబంధాలు నెలకొంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇతర కుటుంబసభ్యుల ఆరోగ్య సమస్యలు కూడా తీరుతాయి. ఇల్లు, భూమి విషయాల్లో మేలు జరుగుతుంది.

55
ధనుస్సు రాశి

ధనుస్సు రాశికి ఈ యోగం అనుకూలంగా మారుతుంది. ఆధ్యాత్మికత, ఉన్నత విద్యపై ఆసక్తి పెరుగుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. సంబంధాలు బలపడతాయి. ఈ రాశివారి జీవితంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయి.

(గమనిక: ఇది జ్యోతిష్య అభిప్రాయం మాత్రమే... ఏసియానెట్ న్యూస్ దీన్ని ధృవీకరించదు. మరింత సమాచారం కోసం జ్యోతిష్య పండితులు, నిపుణులను సంప్రదించండి)

Read more Photos on
click me!

Recommended Stories