Ketu Transit 2026: కొత్త ఏడాదిలో 3 రాశులపై కేతువు కరుణ, డబ్బుతో పాటూ గౌరవం ఇస్తాడు

Published : Dec 07, 2025, 10:31 AM IST

Ketu Transit 2026: కేతువు సంచారం జ్యోతిషం ప్రకారం ఎంతో ముఖ్యం. కేతువు దుష్టగ్రహమే అయినా ఒక్కోసారి మంచి శుభ ఫలితాలను కూడా అందిస్తాడు. కేతువు  ఎప్పుడూ వ్యతిరేక దిశలో సంచారిస్తాడు. ఇది ఒక వ్యక్తి జీవితంపై వివిధ రకాలుగా ప్రభావం చూపుతుంది. 

PREV
14
కేతువు సంచారం 2026

కేతువు సంచారం ఎంతో ప్రధానమైనది. కేతువు కలిసి వస్తే మంచి ఫలితాలను ఇస్తాడు. లేకుంటే  అశుభ ఫలితాలను అందిస్తాడు.  కేతువు ప్రస్తుతం సింహరాశిలో ఉన్నాడు. 2026 చివరి నాటికి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. 2026లో కేతువు కొన్ని నక్షత్రాలను కూడా మారుస్తాడు. ప్రస్తుతం కేతువు పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఉండి, 2026లో మార్చి 29న మఘ నక్షత్రంలోకి ఆ తర్వాత డిసెంబర్ 5న ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇది అన్ని రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ కొన్ని రాశులకు మాత్రం 2026 కలిసి వచ్చేలా ఉంటుంది. ముఖ్యగా కేతువు వల్ల కొన్ని రాశుల వారికి డబ్బుతో, సమాజంలో గౌరవం పెరుగుతుంది. 

24
కన్యా రాశి

కొత్త ఏడాది కేతువు సంచారం కన్యారాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. వీరికి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగంలో ఉన్న అస్థిరత కూడా తొలగిపోతుంది. వ్యాపారస్తులకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఏదైనా పని కొత్తగా ప్రారంభించాలనుకునే వారికి  ధైర్యం వచ్చే సమయం ఇదే. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. డబ్బును గడిస్తారు. గౌరవం పెరుగుతుంది. ా 

34
తులా రాశి

తుల రాశి వారికి కేతువు సంచారం వల్ల లాభదాయకంగా ఉంటుంది. వీరి జీవితంలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొందరికి ప్రమోషన్ రావచ్చు లేదా పై అధికారుల దగ్గర మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. సొంత వ్యాపారం ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. అనుబంధాలు,  భాగస్వామ్యాలు కొత్త స్పష్టతను పొందుతాయి. గొడవలు తగ్గుతాయి.

44
మకర రాశి

మకర రాశి వారికి 2026లో అదృష్టం పెరుగుతుంది.  ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. ఇరుక్కుపోయినా డబ్బును తిరిగి పొందేకాలం ఇది. వీరు ఎక్కడ పెట్టుబడులు పెట్టినా లాభదాయకంగా ఉంటుంది. వృత్తిలో మార్పు చేయాలనుకుంటున్న వారికి ఇదే మంచి సమయం. విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకులుగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories