Gold Numerology: సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని ముఖ్యమైన తేదీల్లో జన్మించిన వారు బంగారం పెట్టుకుంటే వారి దశ మారిపోతుంది. బంగారం వారి అదృష్టాన్ని పెంచుతుంది. చిన్న బంగారు ఉంగరం అయినా… వారి జీవితాన్ని బంగారు మయం చేస్తుంది. మరి, ఆ తేదీలేంటో చూద్దామా..
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి సూర్యుడు అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన వారికి బంగారం చాలా మంచిది. ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం ధరిస్తే.. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. ఉద్యోగంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అడ్డంకులు తొలగిపోతాయి. ఈ బంగారం వీరిని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది…
24
నెంబర్ 3..
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై గురు గ్రహ ప్రభావం ఉంటుంది. జోతిష్యశాస్త్రంలో బంగారాన్ని గురు గ్రహానికి సంబంధించిన లోహంగా పరిగణిస్తారు.
ఈ తేదీల్లో పుట్టినవారంతా బంగారం ధరిస్తే.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిర్ణయాల్లో క్లారిటీ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. చదువు, ఉద్యోగం, వ్యాపారాల్లో మంచి ఫలితాలు వస్తాయి. సంతానం కలిగే అవకాశాలు కూడా పెరుగుతాయి.
34
నెంబర్ 9..
ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ 9వ సంఖ్యకు అధిపతి కుజుడు (మంగళ గ్రహం). జ్యోతిషశాస్త్రంలో కుజుడు, గురుడు స్నేహితులు. అందుకే ఈ సంఖ్యలో పుట్టినవారికి బంగారం శుభప్రదం. వీళ్లు బంగారం ధరిస్తే అదృష్టం మెరుగుపడి, జీవితంలోని అడ్డంకులు తగ్గుతాయి. ఇది ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షిస్తుంది. ప్రమాదాలు, అనుకోని కష్టాల నుంచి కాపాడుతుందని, జీవితంలో స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని నమ్ముతారు.
బంగారం ధరించేటప్పుడు ఈ ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోండి
బంగారాన్ని ఎప్పుడూ శరీరం పైభాగంలోనే ధరించాలి. నడుము కింది భాగంలో ధరించడం అశుభం. అందుకే ఉంగరం, గొలుసు లేదా లాకెట్ రూపంలో ధరించడం మంచిది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, కుడిచేతికి బంగారం ధరిస్తే ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి.
బంగారం ధరించేవారు మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇవి గురు గ్రహ ప్రభావాన్ని తగ్గిస్తాయి. బంగారాన్ని ధరించిన తర్వాత తరచుగా తీయకూడదు. ఎక్కువ కాలం ధరిస్తేనే దాని శుభ ప్రభావాలు ఉంటాయి. ఉంగరపు వేలికి బంగారు ఉంగరం ధరించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇది గ్రహాల సానుకూల ప్రభావాన్ని మరింత పెంచుతుంది.