Birth Date: ఈ తేదీల్లో జన్మించిన వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందో తెలుసా?

Published : Aug 01, 2025, 03:54 PM IST

న్యూమరాలజీ ప్రకారం.. ఏ తేదీలో పుట్టిన వారికి ఆగస్టు నెల సానుకూలంగా ఉంటందో, ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుందో తెలుసుకుందాం..

PREV
110
Birth Date

సంఖ్యాశాస్త్రం అనేది జోతిష్యశాస్త్రంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ న్యూమరాలజీ ప్రకారం, మనం ఒక వ్యక్తి పుట్టిన తేదీ ని ఆధారంగా చేసుకోని వారి భవిష్యత్తు, గుణగణాలు, బలాలు, బలహీనతలు, వ్యక్తిత్వం గురించి తెలుసుకోవచ్చు. మరి మీరు పుట్టిన తేదీ ప్రకారం.. మీకు ఆగస్టు నెలలో  ఎలా ఉంటుందో తెలుసుకుందామా,…

210
నెంబర్ 1

న్యూమరాలజీ ప్రకారం, ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 1 కిందకు వస్తారు.  ఈ నాలుగు తేదీల్లో జన్మించిన వారికి ఆగస్టు నెలలో మంచిగానే కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో వీరికి ఉద్యోగ, వ్యాపారాాల్లో బాగుంటుంది. ముఖ్యంగా.. ఉద్యోగం చేసేవారికి పదోన్నతి, జీతం పెరిగే అవకాశం ఉంది. పెళ్లి కానివారికి పెళ్లి జరిగే అవకాశం ఉంది. వీరు ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి.

310
నెంబర్ 2

సంఖ్యాశాస్త్రం ప్రకారం, 2, 11, 20 , 29 తేదీలలో పుట్టినవారు సంఖ్య 2 కిందకి వస్తారు. ఈ తేదీలలో పుట్టినవారికి పెళ్లి కాలేదు అంటే, ఈ నెలలో పెళ్లి జరిగే అవకాశం ఉంది. పెళ్లైనవారు తమ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది. వారికి ఆగస్టు నెలంతా ప్రశాంతత , సమతుల్యత ఉంటుంది. ఈ నాలుగు తేదీలలో పుట్టినవారు ఆగస్టు నెలలో అదృష్టం కలిసి రావాలంటే ప్రతి మంగళవారం రావి చెట్టుకు నీళ్లు పోసి పూజించాలి.

410
నెంబర్ 3..

సంఖ్యాశాస్త్రం ప్రకారం, 3, 12, 21 , 30 తేదీలలో పుట్టినవారు నెంబర్ 3 కిందకి వస్తారు. ఈ తేదీలలో పుట్టినవారికి ఆగస్టు నెలలో డబ్బు లభిస్తుంది. పెళ్లైనవారు తమ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. వారు ఆగస్టు నెలలో అదృష్టం కలిసి రావాలంటే పేదవారికి పసుపు రంగులో ఉన్న ఆహార పదార్థాలు , స్వీట్లను దానం చేయాలి.

510
నెంబర్ 4

న్యూమరాలజీ ప్రకారం, 4, 13, 22 , 31 తేదీలలో పుట్టినవారు నెంబర్ 4 కిందకి వస్తారు. ఆగస్టు నెలలో ఈ తేదీలలో పుట్టినవారు మొదటి వారం బద్దకంగా , అలసటగా ఉంటారు. కష్టపడి పనిచేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితంలో మార్పులు జరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఒడిదుడుకులు ఉంటాయి. అయినప్పటికీ మంచి ఫలితాలే వస్తాయి. మీకు ఆగస్టు నెలలో అదృష్టం కలిసి రావాలంటే శివలింగానికి నీరు , పంచదార నైవేద్యంగా సమర్పించి పూజించండి.

610
నెంబర్ 5..

న్యూమరాలజీ ప్రకారం 5, 14,  23 తేదీలలో పుట్టినవారు నెంబర్  5 కిందకి వస్తారు. ఈ తేదీలలో పుట్టినవారు ఆగస్టు నెలంతా చాలా చురుగ్గా , బిజీగా ఉంటారు. డబ్బు బాగా సంపాదిస్తారు, అయితే ఖర్చులు కూడా ఉంటాయి. ఈ నెలలో పుట్టినవారి వైవాహిక జీవితం బాగుంటుంది.ఆహ్లాదకరంగా ఉంటుంది. పెళ్లి కానివారు త్వరలోనే పెళ్లి చేసుకుంటారు. ఈ తేదీలలో పుట్టినవారు ఆగస్టు నెలలో అదృష్టం కలిసి రావాలంటే పెళ్లి కాని అమ్మాయిలకు, హిజ్రాలకు ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయాలి.

710
నెంబర్ 6

న్యూమరాలజీ ప్రకారం, 6, 15 , 24 తేదీలలో పుట్టినవారు నెంబర్ 6 కిందకి వస్తారు. ఆగస్టు నెలలో ఈ తేదీలలో పుట్టినవారికి ఊహించని అవకాశాలు , కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సమయం గడపలేకపోవచ్చు. కాబట్టి ఆగస్టు నెల మీకు బాగుండాలంటే తెలుపు, లేత గులాబీ రంగు దుస్తులను నెలంతా ధరించండి.

810
నెంబర 7

న్యూమరాలజీ ప్రకారం, 7, 16 , 25 తేదీలలో పుట్టినవారు నెంబర్  7 కిందకి వస్తారు. ఈ తేదీలలో పుట్టినవారు ఆగస్టు నెలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగంలో ప్రశాంతత ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మొత్తం మీద నెలంతా వారికి బాగుంటుంది. అయినప్పటికీ ఆగస్టు నెలలో మీరు సురక్షితంగా , మరింత బాగుండాలంటే, మంగళవారం , శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.

910
నెంబర్ 8

సంఖ్యాశాస్త్రం ప్రకారం, 8, 17 , 26 తేదీలలో పుట్టినవారు సంఖ్య 8 కిందకి వస్తారు. ఆగస్టు నెలలో ఈ తేదీలలో పుట్టినవారి కల నెరవేరుతుంది. వ్యాపారులకు ఈ నెల అదృష్టవంతమైన నెల. ఈ నెలలో కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ తేదీలలో పుట్టినవారు ఆగస్టు నెలలో మంగళవారం లేదా బుధవారం వినాయకుడికి స్వీట్లు నైవేద్యంగా సమర్పించి పూజిస్తే నెలంతా బాగుంటుంది.

1010
నెంబర్ 9..

సంఖ్యాశాస్త్రం ప్రకారం, 9, 18 , 27 తేదీలలో పుట్టినవారు సంఖ్య 9 కిందకి వస్తారు. ఆగస్టు నెల ఈ తేదీలలో పుట్టినవారికి బాగుంటుంది. పనిపై పూర్తి దృష్టి పెడితే విజయం సాధిస్తారు, డబ్బు కూడా బాగా వస్తుంది. అయినప్పటికీ మీరు ఈ నెలంతా బాగుండాలంటే శివలింగానికి పంచదార కలిపిన నీటిని సమర్పించాలి.

Read more Photos on
click me!

Recommended Stories