Moon Venus Transit: చంద్ర, శుక్రుల నక్షత్ర మార్పు.. ఈ రాశులకు అన్నీ లాభాలే!

Published : Aug 01, 2025, 03:39 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నేడు (శుక్రవారం) చంద్ర, శుక్ర గ్రహాలు నక్షత్రం మారనున్నాయి. ఈ సంచారం వేర్వేరు నక్షత్రాల్లో జరిగినప్పటికీ.. ఇది కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది. మరి ఆ రాశులేంటో వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇక్కడ చూద్దాం.   

PREV
14
చంద్ర, శుక్రుల యోగం..

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని సంపద, ఐశ్వర్యం, విలాసవంతమైన జీవితం, ఆనందాలకు కారకుడిగా భావిస్తారు. చంద్రుడ్ని మనస్సు, ప్రకృతి, మాటలు, ఆలోచనలకు కారకుడిగా భావిస్తారు. 

నేడు (శుక్రవారం) ఈ రెండు గ్రహాలు నక్షత్రాలు మారనున్నాయి. చంద్రుడు స్వాతి నక్షత్రంలోకి, శుక్రుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి మేలు జరగనుంది. ఆ రాశులేంటో ఓసారి చూద్దామా..

24
మేష రాశి

చంద్ర, శుక్రుల నక్షత్ర మార్పు మేష రాశి వారికి మేలు చేస్తుంది. ఈ రాశివారికి ఆగస్టు నెల ప్రారంభం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ క్రమంగా పూర్తవుతాయి. దానివల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని వారు చక్కగా నిర్వర్తిస్తారు. 

ఈ రాశివారు సృజనాత్మక రంగంలో మంచి ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. 

34
తుల రాశి

శుక్ర, చంద్రుల సంచారం తుల రాశివారికి ఆర్థిక లాభాలను తెస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. పాత పెట్టుబడుల నుంచి ఆదాయం దక్కుతుంది.  

కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. పెళ్లికాని వారు తమ తోబుట్టువులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.  

44
వృశ్చిక రాశి

మేష, తుల రాశులతో పాటు వృశ్చిక రాశివారికి కూడా చంద్ర, శుక్రుల నక్షత్ర మార్పు శుభ ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. ఆర్థిక స్థిరత్వం వల్ల వ్యాపారులు, దుకాణదారులు సంతోషంగా ఉంటారు. 

వృద్ధులు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ఇది వారి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ రాశివారు తమ తోబుట్టువులతో ప్రయాణాలు ప్లాన్ చేస్తారు. ఇంటా బయట సంతోషంగా గడుపుతారు.

Read more Photos on
click me!

Recommended Stories