Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై రాహు ప్రభావం, ఎప్పుడూ కష్టాలే..!

Published : Nov 03, 2025, 05:12 PM IST

Birth Date:  కొంత మంది జీవితం ఎప్పుడూ కష్టాలతోనే నిండి ఉంటుంది. వీరు ఎంత ప్రయత్నించినా వారిని కష్టాలు వదిలిపెట్టవు. అందుకు వారి జాతకం కూడా కారణం కావచ్చు. అలా ఎప్పుడూ కష్టాలతో సహవాసం చేసే కొన్ని తేదీలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. 

PREV
14
రాహు గ్రహం..

న్యూమరాలజీ ప్రకారం,  రాహు గ్రహం 4వ తేదీని పాలిస్తుంది.  అందుకే, ఏ నెలలో అయినా 4, 13, 22 తేదీల్లో పుట్టిన వారంతా  నెంబర్ 4 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అందరిపై రాహు గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వీరికి కొన్ని ప్రయోజనాలతో పాటు, కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. 

24
4వ సంఖ్య

ఇక జోతిష్య శాస్త్రం ప్రకారం రాహువును క్రూరమైన, పాపపు, మోసపూరిత గ్రహంగా భావిస్తారు. రాహువు భ్రమలను సృష్టిస్తాడు. దాని ప్రభావంతో ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా చెడు సావాసాలు చేస్తారు.  వ్యసనాలకు సులభంగా లోనవుతారు. ఫలితంగా, జీవితాన్ని నాశనం చేసుకొని అనేక ఇబ్బందులు పడతారు. 

34
జీవితంలో సమస్యలు...

రాహువు కారణంగా, ఈ వ్యక్తుల జీవితం నిరంతరం  ఒడిదొడుకులతో నిండి ఉంటుంది. ఒక క్షణంలో ధనవంతులుగా, మరుక్షణంలో పేదవారిగా మారొచ్చు. వీరు మొండిగా, అహంకారంతో ఉంటారు.ఈ వ్యక్తిత్వం వీరికి  హాని చేస్తుంది. వీరి జీవితంలో అనేక ఎత్తుపల్లాలు ఉంటాయి. విభిన్న వ్యక్తిత్వం వల్ల ఇతరులతో సులభంగా కలిసిపోలేరు.

44
విజయాలు..

నెంబర్ 4 కి చెందిన వ్యక్తులకు రాహువు వల్ల కష్టాలు వచ్చినా, గొప్ప విజయాన్ని కూడా ఇస్తుంది. కానీ, దాని కోసం చాలా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.  ఎక్కువ కష్టపడితే.. మంచి స్థాయికి వెళ్లగలరు.   కష్టపడి పనిచేస్తే,  అపారమైన సంపద, ఉన్నత స్థానాలను సాధించగలరు. వీరు ఇంజనీరింగ్, వ్యాపారం, ముఖ్యంగా రాజకీయాల్లో బాగా రాణిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories