Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారికి తిరుగులేదు, పట్టిందల్లా బంగారమే..!

Published : Nov 03, 2025, 03:21 PM IST

Birth Date: న్యూమరాలజీ ప్రకారం ఈ నవంబర్ నెలలో కొన్ని తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం పెరగనుంది. వారు పడిన కష్టానికి తగిన ప్రతి ఫలం లభిస్తుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి, ఆ తేదీలేంటో చూద్దామా.... 

PREV
15
నెంబర్ 5...

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి నవంబర్ నెల బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. వారు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. వారి భాగస్వాముల నుండి మద్దతు లభిస్తుంది. వ్యాపారం లేదా పనిలో విస్తరణకు అవకాశాలు లభిస్తాయి. ఈ నవంబర్ లో కొత్త వాహనం కొనుగోలు చేయడానికి, పెద్ద కొనుగోలు చేయడానికి మంచి సమయం అవుతుంది. ఈ నెల ఏవైనా కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

25
నెంబర్ 7..

ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 7 కిందకు వస్తారు. తమ కుటుంబంలో, ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య లేదా ప్రేమికుల మధ్య ప్రేమ, అవగాహన పెరుగుతుంది. పిల్లల నుండి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. కెరీర్ లో లాభాలు సానుకూలంగా ఉంటాయి. పని వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ నెల మీ కృషికి తగిన ప్రతిఫలితం లభిస్తుంది.

35
నెంబర్ 8...

ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 8 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను చాలా బాగా బ్యాలెన్స్ చేయగలరు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లాభాలు పొందుతారు. కొత్త ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం. పనిలో ప్రశంసలు లభిస్తాయి.

45
నెంబర్ 4...

ఏ నెలలో అయినా 4, 13, 22 తేదీల్లో జన్మించిన వారంతా ఈ నెలలో ఆర్థికంగా బలంగా ఉంటారు. ఆర్థిక లాభం పొందే అవకాశాలు పెరుగుతాయి. గొడవల జోలికి వెళ్లకూడదు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. ఈ నెల ఇంటి పని, వృత్తి పరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి.

55
నెంబర్ 1...

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ నెలలో వారి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. దీర్ఘకాలంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. మీరు మీ కొత్త శక్తితో ముందుకు సాగుతారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో కంటే ఉల్లాసంగా ఉంటారు. ఈ సమయం ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాలు తెచ్చి పెడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories