ఈ సంఖ్యా శాస్త్రం ప్రకారమే.. నాలుగు తేదీల్లో జన్మించిన వారు..తమ భార్యను అమితంగా ప్రేమిస్తారు. తమ కోసం తమ ఇంట్లో అడుగుపెట్టిన భార్యను మహారాణిలా చూసుకుంటారు.
పెళ్లి విషయంలో ప్రతి అమ్మాయికీ చాలా కలలు, కోరికలు ఉంటాయి. ముఖ్యంగా తమ జీవిత భాగస్వామిగా వచ్చే వ్యక్తి విషయంలో కొన్ని ఆశలు పెట్టుకుంటారు. పెళ్లి తర్వాత తమను ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి అని అనుకుంటారు. పుట్టింట్లో తమ పేరెంట్స్ ఎంత ప్రేమించారో.. అంత కంటే ఎక్కువ ప్రేమ తమ భర్త తమపై చూపించాలని అనుకుంటారు. అయితే.. అందరికీ అలాంటి భర్తలు దొరకకపోవచ్చు. కానీ, నాలుగు తేదీల్లో పుట్టిన అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే మాత్రం కచ్చితంగా ఈ కోరిక తీరుతుంది.
25
న్యూమరాలజీ ఏమంటోంది?
న్యూమరాలజీ మన జీవితం ఎలా సాగుతుందో.. మన భవిష్యత్తు ఎలా ఉంటుందో పాటు.. మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో కూడా తెలియజేస్తుంది. మనం పుట్టిన తేదీ ఆధారంగా మన భవిష్యత్తు, వ్యక్తిత్వంతో పాటు..వైవాహిక జీవితం ఎలా సాగుతుందనే విషయాన్ని కూడా న్యూమరాలజీ చెప్పేస్తుంది. ఈ సంఖ్యా శాస్త్రం ప్రకారమే.. నాలుగు తేదీల్లో జన్మించిన వారు..తమ భార్యను అమితంగా ప్రేమిస్తారు. తమ కోసం తమ ఇంట్లో అడుగుపెట్టిన భార్యను మహారాణిలా చూసుకుంటారు.మరి, ఆ నాలుగు స్పెషల్ తేదీలేంటో చూద్దామా...
35
నెంబర్ 2..
సంఖ్యా శాస్త్రంలో నెంబర్ 2 లో పుట్టిన అబ్బాయిలు చాలా మంచివారు. ముఖ్యంగా తమ భార్య విషయానికి వస్తే.. వారికి ఎలాంటి వంక కూడా పెట్టలేము. ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన అబ్బాయిలంతా నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారికి చంద్రుడు అధిపతి. జోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనసుకు కారకుడు.
ఇక.. ఈ నాలుగు తేదీల్లో పుట్టిన అబ్బాయిలు నిజాయితీకి మారు పేరు. వాళ్ల మాట్లలో మాత్రమే కాదు.. మనసులో కూడా కపటం, మోసం అనేవి ఉండవు. వీరు కుటుంబానికి చాలా ఎక్కువ విలువ ఇస్తారు. ఇక భార్యను అయితే అమితంగా ప్రేమిస్తారు. తాము ఎంత కష్టపడినా.. భార్య మాత్రం కష్టం లేకుండా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. వీలైనంత వరకు ఆమె కంట నీరు రాకుండా చూసుకుంటారు.
ఈ అబ్బాయిలకు మంచి భర్త అవార్డు కూడా ఇవ్వొచ్చు. భార్య కోరికలన్నీ కచ్చితంగా తీర్చడానికి ప్రయత్నిస్తారు. అడగడమే ఆలస్యం.. కోరికనవన్నీ తెచ్చి ఇస్తూ ఉంటారు. భార్యతో పాటు.. తమ పిల్లలను కూడా చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. వీరి వ్యక్తిత్వం కారణంగా వారి కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది.
55
మంచి స్నేహితులు కూడా..
ఇక, ఈ అబ్బాయిలు చిన్నతనం నుంచే చదువులో చాలా చురుకుగా ఉంటారు. ఉన్నత విద్యను అభ్యసిస్తారు. సృజనాత్మకత ఎక్కువగా ఉండే పనులు చేయడానికి ఇష్టపడతారు. వీరిపై శివుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఆయన అనుగ్రహం కారణంగా వీరు ఎంత పెద్ద కష్టం వచ్చినా.. దాని నుంచి బయటపడతారు. ఇక.. వీరికి మేనత్త, మేనమామల ప్రేమ కూడా లభిస్తుంది. వీలైనంత వరకు వీరు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటారు. భార్య , పిల్లల విషయంలోనే కాదు.. స్నేహం విషయంలోనూ వీరిని మించిన వారు మరొకరు ఉండరు. మంచి స్నేహితులు అవుతారు. దాదాపు ఈ అబ్బాయిలు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు.
Disclaimer
ఈ వ్యాసంలోని సమాచారం ధర్మ గ్రంథాలు, పండితులు, జ్యోతిష్కుల నుంచి తీసుకున్నాం. మేము ఈ సమాచారాన్ని మీకు అందించే ఒక మాధ్యమం మాత్రమే. దీన్ని కేవలం సమాచారంగానే భావించండి.