కార్తీక అమావాస్య.. ఈ 5 రాశులవారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది!

Published : Nov 14, 2025, 02:26 PM IST

జ్యోతిష్యం ప్రకారం ప్రతి అమావాస్య రాశిచక్రాలపై మంచి, చెడు ప్రభావాలను చూపిస్తుంది. త్వరలో కార్తీక అమావాస్య రానుంది. ఇది చాలా ప్రత్యేకమైనది. ఇది చీకటి రాత్రి మాత్రమే కాదు, శక్తుల మార్పు జరిగే సమయం. ఆ రోజున కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.  

PREV
16
కార్తీక అమావాస్య 2025

కార్తీక అమావాస్య ఈ నెల (నవంబర్) 20న రానుంది. ఇది చాలా శక్తివంతమైనదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ అమావాస్య కొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అమావాస్య నాడు చంద్రుడు అత్యంత బలహీనంగా ఉండడం వల్ల మనసు, కుటుంబ సంబంధాలు, ఆర్థిక నిర్ణయాలు, ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మరి ఏ రాశులవారు కార్తీక అమావాస్య నాడు జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం. 

26
మిథున రాశి

మిథున రాశి వారికి కార్తీక అమావాస్య కొంత ఒత్తిడి, ఆందోళనను తెచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశివారు ఇతరులతో వాదనలు లేదా ఆస్తి సంబంధిత వివాదాలలో చిక్కుకోవచ్చు. సహనం కోల్పోకూడదు. ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవాలి. ఆస్తి లేదా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఇతరులను నమ్మే ముందు, వాస్తవాలను స్వయంగా తెలుసుకోవాలి. వేరే వాళ్లను నమ్మి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టపోయే అవకాశం ఉంది. 

36
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు ఈ అమావాస్య రోజున ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. కొందరు ఈ రాశివారి నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో మీ కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే సంఘటనలు జరగవచ్చు. దొంగతనం లేదా నష్టం జరిగే అవకాశం ఉన్నందున ఈ రాశివారు ఆర్థికంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చట్టపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టాలకు దారితీయవచ్చు.

46
కన్య రాశి

కార్తీక అమావాస్య కన్య రాశి వారికి కొత్త సవాళ్లను తీసుకువస్తుంది. పనిలో లేదా వ్యాపారంలో ఆటంకాలు ఎదురుకావచ్చు. ఏ పనినీ తేలికగా తీసుకోవద్దు. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ రాశివారి ప్రతిష్టకు హాని కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే ముందు అవతలి వ్యక్తి ఉద్దేశాలను పరిగణలోకి తీసుకోవాలి. లేకపోతే మోసపోయే అవకాశం ఉంది. 

56
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు కార్తీక అమావాస్య రోజున మానసిక ఒత్తిడిని అనుభవిస్తారు. ఆ రోజున ఈ రాశివారు ప్రవర్తనలో అహంకారం లేదా కోపం చూపిస్తే, అది మీకే సమస్యగా మారుతుంది. ఇతరులను అవమానించడం లేదా తక్కువగా చూడటం మానుకోవాలి. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. కుటుంబంలో భేదాభిప్రాయాలు తలెత్తవచ్చు. అది మీ మనశ్శాంతిని దెబ్బతీస్తుంది. అలాగే ఏ పని చేసినా ఫలితాలు కాస్త ఆలస్యంగా రావచ్చు.

66
మకర రాశి

మకర రాశి వారికి ఈ అమావాస్య ఒత్తిడిని తీసుకువస్తుంది. ఇంటా బయటా కొన్ని విషయాలు, పనులు భారంగా అనిపించవచ్చు. టైంకి పనులు పూర్తికాక నిరాశ పెరుగుతుంది. ఈ సమయంలో ఇతరుల మాటలకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. మిమ్మల్ని మీరు నమ్మండి. ఎక్కువగా ఆలోచించడం ఆందోళనను పెంచుతుంది. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories