Ganga Water: హిందూ మతంలో గంగను దేవతలా పూజిస్తాము. ప్రజలు గంగాజలాన్ని ఇంటికి తెచ్చి శుభ్రపరచుకుంటారు. కానీ కాశీలోని గంగా ఘాట్‌ల నుండి గంగాజలం తీసుకురావడం అశుభమని చాలా తక్కువమందికే తెలుసు. గరుడ పురాణం ఇదే విషయాన్ని చెబుతోంది.
హిందూమతంలో గంగను ఎంతో ప్రవిత్రంగా చూస్తారు. గంగా ఘాట్‌లలో భక్తులు స్నానం చేశా పవిత్ర గంగాజలాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. ఆ గంగాజలాన్ని ఇంటిని శుభ్రపరిచేందుకు ఉపయోగిస్తారు. ఇంట్లోని నెటివివ్ శక్తిని బయటికి పంపేందుకు గంగా జలాన్ని ఉపయోగిస్తారు. గంగాజలాన్ని ఎంతో పవిత్రం పూజలు, మతపరమైన కార్యక్రమాల్లో వాడతారు.
26
కాశీ గంగా ఘాట్
గంగా నది ఒడ్డున కాశీ నగరం ఉంది. దీన్ని వారణాసి అని పిలుస్తారు. కాశీ ఒక పవిత్ర నగరం. ఈ కాశీ నగరాన్ని మోక్షాన్ని పొందే ప్రదేశంగా పిలుచుకుంటారు. శివుడు వారణాసిలోనే నివసిస్తాడని శివ భక్తుల నమ్మకం. మోక్షం కోసం ప్రజలు కాశీకి వెళుతుంటారు.
36
కాశీ నుండి గంగాజలం తేవచ్చా?
హరిద్వార్, రిషికేశ్, గంగోత్రి లేదా ప్రయాగ్‌రాజ్ నుండి గంగాజలం తేవడం శుభప్రదంగా భావిస్తారు. కానీ, శివుని నగరమైన కాశీ నుండి మాత్రం గంగాజలం తేకూడదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈసారి కాశీ వెళ్లినప్పుడు అక్కడ నుంచి కాకుండా పైన చెప్పిన మిగతా నగరాల నుంచి గంగా జలం తెచ్చేందుకు ప్రయత్నించండి.
సనాతన ధర్మంలో కాశీని మోక్ష నగరంగా పిలుస్తారు. కాశీలోని మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ల లో రోజూ ఎంతోమందికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. వారి అస్థికలను గంగా నదిలో కలుపుతారు. ఇలా చేస్తే మరణించిన ఆత్మకు మోక్షం లభిస్తుందని నమ్మకం.
56
ఆత్మల శక్తి
కాశీ నగరం దగ్గరలోని గంగాజలంలో ముక్తి పొందిన ఆత్మల శక్తి ఉంటుందని అంటారు. అందుకే అక్కడి నుండి గంగాజలం తేవడం అశుభంగా భావిస్తారు. ఎవరైనా ఇంటికి తెస్తే ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. ఇది ఇంట్లో ప్రాణాంతక సమస్య వచ్చే అవకాశం ఉందని అంటారు.
66
కాశీ మట్టిని కూడా...
మత విశ్వాసాల ప్రకారం, కాశీ నుండి గంగాజలం లేదా మట్టిని ఇంటికి తేవడం పాపంగా భావిస్తారు. తెలియక, ఈ గంగాజలాన్ని వాడి, చనిపోబోయే వారికి మోక్షం రాకుండా అడ్డుకున్నట్టు అవుతుంది. కాబట్టి కాళీవెళ్లేటప్పుడు ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి.