Name Astrology: ఈ అక్షరంతో పేరు మొదలైన వారికి డబ్బుకి లోటు ఉండదు..!
మీ పేరు కనుక ఈ అక్షరాలతో మొదలైతే.. జీవితంలో ఆర్థికంగా బాగా స్థిరపడగలరు. మరి, ఆ స్పెషల్ అక్షరాలు ఏంటో ఓసారి చూద్దామా..
మీ పేరు కనుక ఈ అక్షరాలతో మొదలైతే.. జీవితంలో ఆర్థికంగా బాగా స్థిరపడగలరు. మరి, ఆ స్పెషల్ అక్షరాలు ఏంటో ఓసారి చూద్దామా..
జోతిష్యశాస్త్రంలో పేరుకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. మన పేరులోని మొదటి అక్షరం మన వ్యక్తిత్వం, మన లైఫ్ లో ఉన్న అదృష్టాన్ని కూడా తెలుసుకోవచ్చు. కొంత మందికి, వారి పేరులోని మొదటి అక్షరాలు శ్రేయస్సు, విజయాన్ని అందిస్తాయి. పూర్తిగా జీవితాన్ని కూడా మార్చేయగలవు. మరి ఏ అక్షరంతో పేరు మొదలైన వారి కి లైఫ్ లో డబ్బు సమస్య అనేది రాదో ఇప్పుడు తెలుసుకుందాం...
1.అక్షరం A
మీ పేరులో మొదటి అక్షరం కనుక A తో మొదలైతే మీరు కచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. జోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ పేరు గలవారికి ఆర్థిక సమస్యలు ఉండవు. వీరికి ఏ పరిస్థితుల్లోనూ డబ్బు లోటు అనేది ఉండదు. ఒకవేళ అనుకోని అవసరం వచ్చినా.. ఏదో ఒక రూపంలో డబ్బు వారిని చేరుతుంది. వీరు జీవితంలో అనుకున్న స్థాయికి చేరుకుంటారు. విజయం సాధించాలనే వీరి కోరిక నెరవేరుతుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.
అక్షరం R
"R" అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఉల్లాసంగా ఉంటారు. వీరు అందరితోనూ చాలా స్నేహంగా ఉంటారు. అందుకే వీరికి స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారు. వారు జీవితంలో ఎక్కువగా సాహసాలు చేయడానికి ఇష్టపడతారు. వీరికి చిన్న వయసు నుంచే ఆర్థిక స్థిరత్వం చాలా ఎక్కువ. రోజు రోజుకీ సంపదను పెంచుకుంటూ ఉంటారు. డబ్బు విషయంలో వీరు చాలా తెలివిగా ఉంటారు.
అక్షరం S
"S" అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు జ్ఞానం ,శ్రద్ధను సూచిస్తాయి. ఈ మొదటి అక్షరంతో ఉన్నవారికి దేవుడి ఆశీస్సులు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు జీవితంలో ఆర్థికంగా బాగా స్థిరపడతారు. వీరికి లైఫ్ లో డబ్బు సమస్య ఎక్కువగా రాదు. వారి అవసరాలకు ఎప్పుడూ డబ్బు అందుతుంది. వీరు ఇతరుల ప్రశంసలు అందుకుంటారు. ఎక్కువగా వీరు లైఫ్ లో లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు.
"V" అక్షరం
"V" తో ప్రారంభమయ్యే పేర్లు వినయపూర్వకంగా ఉంటారు. చాలా కష్టపడి పని చేసే మనస్తత్వం ఉంటుంది. పట్టుదలతో అనుకున్నది సాధించగలరు. చిన్న వయసులోనే అనుకున్న విజయం సాధించగలరు. డబ్బు బాగా సంపాదించగలరు. ఉన్నత స్థాయికి చేరుకుంటారు.