వేద జ్యోతిష్యం ప్రకారం గ్రహాల సంచారమే మానవ జీవితంపై ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రతి గ్రహం తన దిశలో ప్రయాణించేటప్పుడు, కొన్ని శుభయోగాలు ,అశుభయోగాలను సృష్టిస్తుంది. అటువంటి అత్యంత శక్తివంతమైన యోగాలలో "గజకేసరి రాజయోగం" ఒకటి. ఈ యోగం గురుగ్రహం ,చంద్రుని కలయికలో ఏర్పడుతుంది. ఇది చాలా అరుదుగా ఏర్పడే యోగం కాగా, దీని ప్రభావం ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చివేసే శక్తిని కలిగి ఉంటుంది.
ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30న జరుపుకోనున్నారు. అదే రోజున గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా మారనుంది.