Rahu Ketu: రాశి మారుతున్న రాహు-కేతువులు.. ఈ 5 రాశుల కష్టాలన్నీ తీరినట్లే!

జ్యోతిష్య శాస్త్రంలో రాహు-కేతువులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇవి ఎప్పుడూ తిరోగమనం చేస్తుంటాయి. ఇవి రెండు త్వరలో రాశి మారనున్నాయి. రాహు, కేతువుల రాశి మార్పు కొన్ని రాశులకు అదృష్టాన్ని మోసుకురానుంది. ఆ రాశులెంటో వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

Rahu Ketu Transit May 2025 Three Zodiac Signs Benefit in telugu KVG

రాహువు, కేతువు చాలా ప్రత్యేకమైనవి. మే 18న, రాహువు, కేతువు రాశులు మారనున్నాయి. రాహువు మీన రాశి నుంచి కుంభ రాశిలోకి, కేతువు కన్య రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తాయి. రాహు-కేతువుల రాశి మార్పు ప్రభావం.. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులపై పడుతుంది. కొన్ని రాశుల వారికి ఈ మార్పు శుభప్రదం. ఆ రాశులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Rahu Ketu Transit May 2025 Three Zodiac Signs Benefit in telugu KVG
సింహ రాశి

సింహ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి కొత్త అవకాశాలు వస్తాయి. ధనలాభం ఉంటుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సింహ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.  
 


మిథున రాశి

రాహు కేతువుల రాశి మార్పు మిథున రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక లాభాలున్నాయి. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కొత్త బాధ్యతలు వస్తాయి. ఆకస్మిక ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది. ప్రియమైన వారితో సమయం గడుపుతారు. విదేశీయానం చేసే అవకాశం ఉంది.  

మేష రాశి

మేష రాశి వారికి లాభం చేకూరుతుంది. ఉద్యోగంలో అభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి. కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. శుభకార్యాల్లో అదృష్టం కలిసివస్తుంది. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

మకర రాశి

మకర రాశి వారికి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలుంటాయి. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో సంతోషం, శాంతి, సమృద్ధి నెలకొంటాయి. ఆలోచనాత్మక పెట్టుబడులు లాభాలను, సంపదను తెస్తాయి.  
 

ధనుస్సు రాశి

రాహు, కేతువుల మార్పు ధనుస్సు రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. పనిలోని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు.
 

Latest Videos

vuukle one pixel image
click me!