Planetary Retrograde: నవంబర్లో మూడు గ్రహాలు వక్ర సంచారం చేయబోతున్నాయి. ఈ గ్రహాల వక్ర సంచారం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది. కొన్ని రాశుల వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
జ్యోతిషశాస్త్రంలో వక్ర సంచారం ఎంతో ముఖ్యమైనది. ఒక గ్రహం వెనుకకు ప్రయాణించడాన్ని వక్రసంచారం అంటారు. ఈ నవంబర్ నెలలో మూడు గ్రహాలు వక్ర స్థితిలో సంచరించబోతున్నాయి. దీని వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది. ఏ గ్రహాలు వక్ర సంచారంలో ఉండబోతున్నాయో తెలుసుకోండి.
26
గురు గ్రహం
నవంబర్ 11, 2025న గురు గ్రహం ఇప్పటికే కర్కాటక రాశిలో వక్ర సంచారం చేస్తున్నాడు. ఈ వక్ర స్థితి మార్చి 2026 వరకు కొనసాగుతుంది. దీనివల్ల కుటుంబ, ఆర్థిక విషయాల్లో ఎన్నో మార్పులు కలుగుతాయి.
36
బుధ గ్రహం
నవంబర్ 10, 2025 నుంచి బుధుడు వృశ్చిక రాశిలో వక్ర సంచారంలోనే ఉన్నాడు. బుధుడు కమ్యూనికేషన్‌లో గందరగోళం, ప్రయాణాల్లో జాప్యం, ఒప్పందాల్లో సమస్యలను కలిగిస్తాడు. రహస్యంగా ఉంచాల్సిన విషయాలను బయటపెట్టేస్తాడు.
నవంబర్ 28, 2025 నుంచి శని దేవుడు కూడా వక్రసంచారం ప్రారంభిస్తాడు. మీనరాశిలో ఈ వక్ర సంచారం జరుగుతుంది. దీనివల్ల పనుల్లో పురోగతి, అడ్డంకులు తొలగిపోతాయి. స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు.
56
మంచి ఫలితాలు పొందే రాశులు
వృషభం: ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. వివాహంలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి.
కన్య: ఈ రాశి వారికి ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు
మకరం: ఈ రాశి వారికి రాజయోగం కలుగుతుంది. వీరి ఆదాయం పెరుగుతుంది.
66
జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు
మేషం: ఈ రాశి వారికి కుటుంబ, ఆస్తి విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి
కుంభం: వృత్తిపరమైన పోటీలు, ఒత్తిడి పెరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.