Dog Barking: మన భారతీయ సంస్కృతిలో జంతువుల ప్రవర్తనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. బయటికి వెళ్లినప్పుడు నల్ల పిల్లి ఎదురవ్వకూడదని అంటారు. అలాగే మరికొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. వాటిలో రాత్రి వేళ కుక్క అరవడం.
రాత్రివేళ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అలాంటతి సమయంలో ఇంటి ముందు కుక్కలు అకస్మాత్తుగా మొరుగుతుంటే చాలా మందికి భయం వేస్తుంది. ఏదైనా చెడు జరగబోతుందేమో? అని భావిస్తారు. మన సమాజంలో కుక్క పదే పదే మొరగడం, రాత్రివేళ ఇంటి ముందు నిల్చుని అరవడంవంటి విషయాలకు శకునశాస్త్రంలో ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు. శకునశాస్త్రం ప్రకారం కుక్కలు భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలను ముందుగానే గ్రహించగల శక్తి కలిగిన జంతువులు అని చెబుతారు. అందుకే అవి ఎప్పుడెప్పుడు, ఎలా మొరుగుతాయో దాని మీద ఆధారపడి శుభాశుభాలు నిర్ణయిస్తారు.
25
రాత్రి కుక్క మొరగడం
రాత్రిపూట ఇంటి ముందు నిల్చుని కుక్క మొరగడంపై పెద్దల్లో ఒకరకమైన నమ్మకం ఉంది. ఈ నమ్మకం ప్రకారం అలా కుక్క మొరగడం అశుభ సూచనగా భావిస్తారు. అంటే ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రావడం లేదా ఏదైనా చెడు వార్త వినే అవకాశం ఉన్నట్లు చెబుతారు. అందుకే రాత్రి పూట కుక్క మొరిగితే ఎంతో భయపడిపోతారు.
35
కుక్క ఆకాశం వైపు మొరగడం
కొన్ని సార్లు కుక్క తల ఎత్తి ఆకాశం వైపు చూస్తూ మొరుగుతాయి. ఇది కూడా అశుభంగానే చెబుతారు. అలా కుక్కలు మొరుగుతూ ఉంటే 0ఆ ప్రాంతంలో ఏదైనా దురదృష్టకర సంఘటన జరగబోతోందని శకున శాస్త్రం చెబుతోంది. కొన్ని సార్లు ఇంటి చుట్టూ కుక్క తిరుగుతూ మొరగుతుంది. ఇది కూడా కొంతమందికి భయాన్ని కలిగిస్తుంది. దీన్ని ఏదైనా చెడుజరగబోయే ముందు వచ్చే హెచ్చరికగా భావించాలని శకున శాస్త్రం చెబుతోంది.
పైన చెప్పిన విషయాలన్నీ శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రివేళ కుక్కలు మొరగడం చాలా సహజమైన వ్యవహారం. కుక్కల వినికిడి శక్తి మనుషుల కంటే చాలా ఎక్కువ. అవి మనకు వినిపించని చిన్న శబ్దాలు, వాసనలకూ కూడా ప్రతిస్పందిస్తాయి. ఉదాహరణకు దూరంలో వాహనాల శబ్దం లేదా అపరిచితుల వాసన వంటివి అవి గుర్తిస్తాయి. అందుకే అవి మొరుగుతాయి.
55
పురాణాల్లో శునకం పాత్ర
పురాణాల్లో కూడా కుక్కలకు ప్రత్యేక స్థానం ఉంది. యమధర్మరాజుకు కుక్క స్నేహితుడు అని చెబుతారు. అందుకే కొందరు దీన్ని దేవతలతో సంబంధమున్న సూచనగా భావిస్తారు. అయితే భయం లేదా అపశకునంగా తీసుకోవడం కన్నా, జంతువుల సహజ ప్రవర్తనగా అర్థం చేసుకోవడం మంచిదని సైన్సు చెబుతోంది. రాత్రివేళ కుక్క మొరగడం గురించి ఉన్న నమ్మకాలు మూఢనమ్మకాలుగా కొట్టిపడేసే వారు ఉన్నారు. కుక్కలు మన ఇంటిని, పరిసరాలను కాపాడే జంతువులు. అవి మొరగడం ద్వారా మనకు ఏదైనా అనుమానాస్పదమైనది జరుగుతోందని తెలియజేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి.