3.తుల రాశి...
తుల రాశి అధిపతి స్వయంగా శుక్రుడు కావడంతో, శుక్ర మహాదశ వీరికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో పాత కష్టాలు, అడ్డంకులు అన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. శుక్రుడు అందం, సౌందర్యం, సుఖసౌకర్యాలకు అధిపతి కాబట్టి ఈ రాశి వారికి ఈ దశలో ఆర్థిక బలం, ప్రతిష్ఠ, ఆనందం ఎక్కువగా లభిస్తాయి. సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా మారతాయి, కొత్త ఒప్పందాలు వస్తాయి. ఆరోగ్యపరంగా మీరు బలంగా ఉంటారు. ప్రేమజీవితంలో సంతోషం, కుటుంబంలో శాంతి నెలకొంటాయి. ఏ చిన్న సమస్య వచ్చినా దాని పరిష్కారం మీలోనే ఉంటుంది.
శుక్ర మహాదశ ప్రారంభం...
శుక్రుడు మన జీవితంలో అందం, ప్రేమ, కళ, ఆర్థిక స్థిరత్వం, సంతోషాన్ని అందించే గ్రహం. ఆయన మహాదశలో సాధారణంగా చాలా మంది జీవితాల్లో సుఖశాంతి, సంపద, సామాజిక గౌరవం పెరుగుతాయి. సరిగా సద్వినియోగం చేసుకుంటే... 20 ఏళ్ల పాటు సంతోషంగా జీవిస్తారు.