Jupiter Retrograde: కర్కాటక రాశిలో గురు గ్రహ తిరోగమనం... ఈ రాశులకు కుబేర యోగం

Published : Oct 27, 2025, 11:36 AM IST

Jupiter Retrograde: గ్రహాలు తరచుగా మారుతూ ఉంటాయి.  నిర్దిష్ట కాలం తర్వాత ఒక్కో రాశి నుంచి మరో రాశిలోకి అడుగుపెడుతూ ఉంటాయి. ప్రస్తుతం గురు గ్రహం వక్ర గతిలో ఉండగా.. అది కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇవ్వనుంది. 

PREV
15
కుబేర యోగం...

గురు గ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో వక్రగతిలో ప్రయాణిస్తున్నాడు. గురు గ్రహం గౌరవం, ధనానికి అధిపతి. ఇప్పుడు ఈ గ్రహం వక్రగతిలో ఉండటం వల్ల.. దీని ప్రభావం చాలా రహస్యంగా ఉంటుంది. దీని వలన కొన్ని రాశులపై అదృష్టం పెరగనుంది. మరీ ముఖ్యంగా.. కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది. దీని కారణంగా... ఆదాయం పెరుగుతుంది. మరి, ఏ రాశులకు ఈ ప్రయోజనాలు కలగనున్నాయో ఇప్పుడు చూద్దాం...

25
కుంభ రాశి...

కుంభ రాశి వారికి గురు గ్రహ వక్రగతి ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. గతంలో ఎదురైన ఆర్థిక కష్టాలన్నీ ఈ సమయంలో తీరిపోతాయి. మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావడం మొదలౌతుంది. కొత్త గా ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించగలరు. కుటుంబంలో శాంతి, ఆనందం పెరుగుతాయి. కుబేరుడి అనుగ్రహం లభించడం వల్ల ధన ప్రవాహం పెరుగుతుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ రావడం, లేదా జీతం పెరగడం లాంటివి జరుగుతాయి. అదృష్టం పూర్తిగా మీ వైపే ఉంటుంది.

35
మేష రాశి...

మేష రాశికి కూడా ఇది చాలా అనుకూల సమయం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు పూర్తి చేయగలరు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇంట్లో, ఆఫీసులో మీరు ఏది చెబితే అదే జరుగుతుంది. గతంలో పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ధైర్యంగా ముందుకు సాగితే... విజయం మీ వైపే ఉంటుంది. ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్లగలరు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది.

45
కర్కాటక రాశి....

కర్కాటక రాశి గురు గ్రహంలోనే సంచరిస్తోంది కాబట్టి... ఈ సమయం ఈ రాశివారికి మరింత ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు చేసే పనులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎక్కడ పెట్టుబడి పెట్టినా లాభాలు అందుకుంటారు. డబ్బు ఎక్కువగా ఆదా కూడా చేయగలరు. కెరీర్ లో కొత్త అవకాశాలు లభిస్తాయి. స్నేహితుల సహాయం లభిస్తుంది. కొందరికి విదేశీ అవకాశాలు కూడా రావచ్చు.

55
కన్య రాశి...

కన్యా రాశి వారికి ఈ కాలం అత్యంత అదృష్టంగా మారనుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు వస్తాయి, వాటి ద్వారా మంచి లాభాలు పొందుతారు. పిల్లలతో ఆనందం పంచుకునే సమయం ఇది. కొత్త వాహనం కొనుగోలు యోచన ఉన్నవారికి ఇది అనుకూల కాలం. అదృష్టం బలపడటంతో లాటరీ లేదా ఊహించని మార్గాల్లో ధన లాభం కలగవచ్చు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories